– తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ తెరాస
– కేసీఆర్ పాలనకు అకర్షితులై తెరాసలో చేరికలు
– నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో విజయం ఖాయం
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హాలియా (నాగార్జునసాగర్) మార్చి 22ః తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో ముందుకు తీసుకు వెళ్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి పట్టంకట్టి నాగార్జున సాగర్ ఉపఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థిని గెలిపించాలని రామగుండం ఎమ్మెల్యే, హాలియా టిఆర్‌ఎస్. పార్టి ఇంచార్జి కోరుకంటి చందర్ కోరారు. సోమవారం హలియా మున్సిపాలటీ 7,9వ వార్డులలో నిర్వహించిన భరోస సమావేశాలలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అభివృద్ధి, ప్రజహితం, సంక్షేమ పథకాలను అమలు చేస్తూ పెదోళ్ల కళ్లలో అనందం నింపుతున్నారని తెలిపారు. గతంలో ఉన్న 200 రూపాయల పించను 2వేలకు పెంచారని తెలిపారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒంటరి మహిళలకు 2వేలు పించన్ అందిస్తున్న ఘనత కేసీఆర్ దన్నారు.

కడుపులో ఉన్న పాసిపాప నుండి పండు ముసలి వరకు సంక్షేమ పథకాలను అందిస్తున్న ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు. పేద ఆడబిడ్డల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1లక్ష 116 రూపాయలను అందించడం జరుగుతుందన్నారు. వృద్ధులకు, ఒంటరి మహిళకు వికలాంగులకు ఆసరా పథకం ద్వారా అండగా సిఎం కేసీఆర్ నిలుస్తున్నారన్నారు. ఆరున్నర సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకు వెళ్తున్న మహనేత కేసీఆర్ ఆన్నారు.

గత సమైఖ్య పాలనలో తెలంగాణ రైతాంగం ఆత్మహత్యలు పాల్పడే పరిస్థితులుండేవని, టిఆర్‌ఎస్ పాలనలో రైతులకు ఉచితంగా 24 గంటల కరెంట్, రైతు భీమా, రైతు బంధు, సకాలంలో ఎరువులు అందించి రైతాంగం కళ్లల్లో ఆనందం నింపిన రైతు బంధువు కేసీఆర్ అన్నారు.

హలియా పట్టణంలోని వార్డులలోని అన్ని సమస్యలు పరిష్కరించుతామని పేర్కొన్నారు. పట్టణంలోని ఆయా వార్డులలో తాము పర్యటించిన సందర్భంల్లో లబ్ధిదారులు, ప్రజలంతా టిఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇస్తామని, కారుగుర్తుకు ఓటు వేస్తామని తెలిపారన్నారు. తెరాస ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రాబోవు ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా నాగార్జునసాగర్ నియోజవర్గంలోని అనుముల గ్రామం నుండి బారీ సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు టిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారిని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో హలియా చైర్మన్ పార్వతి శంకరయ్య, వైస్ చైర్మన్ సుధాకర్, కో ఆప్షన్ సభ్యులు అన్వరోద్దీన్, ప్రసాద్ నాయక్, కాశయ్య, నాగేందర్, లింగన్న,ఆంజనేయులు, ముత్యాలు, నర్సింహ, కార్పోరేటర్ కుమ్మరి శ్రీనివాస్, సైదులు, కోటి, లింగన్న, నాగరాజు, సైదులు, మోతిలాల్, మురళీ,షకీల్, జనార్ధన్ అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.