(ప్రజాలక్ష్యం విలేకరి)
కరీంనగర్, సెప్టెంబర్ 25: భారతీయ జనసంఘ్ అధ్యక్షులు, మేధావి పండిత దీన్ దయాల్ ఉపాధ్యాయ 104వ జయంతి పురస్కరించుకొని బీజీపి ఆద్వర్యంలో కరీంనగర్ కార్పోరేషన్ పరిధి 50వ డివిజన్ గణేష్‌నగర్‌లో శుక్రవారం బీజేపి కార్యకర్తలు మొక్కలు నాటే కార్య క్రమాన్ని చేపట్టారు. కాలనీలోని ప్రతి వీధిలో మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా బీజీపి డివిజన్ ఇంచార్జి దేవిశెట్టి నవీన్ మాట్లాడుతూ దీన్ దయాల్ ఉపాధ్యాయ భారతదేశ ఉనికి చేసిన సేవలు మరువలేనివని, దేశ అభివద్ధి కోసం తన ప్రాణాలను సైతం వదిలిన మహామూర్తి అని కొనియాడారు. ఆయన స్థాపించిన జనసంఘ్ పార్టీ మహావక్షమై 1980లో బిజెపి గా అవతరించిందని తెలిపారు. ప్రస్తుతం అధికారంలో వున్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ప్రధానిగా వున్న నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత దేశాన్ని తీర్చిదిద్దుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీజేపి నాయకులు కూర మహిపాల్ రెడ్డి, వాసుదేవరెడ్డి, తణుకు సాయి, సురేందర్, అరుణ్ తేజ తదితరులు పాల్గొన్నారు.