Home తెలంగాణ వ్య‌వ‌సాయాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం

వ్య‌వ‌సాయాన్ని కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం

605
0
Ramagundam Corporation Congress leaders participating in the bandh
Ramagundam Corporation Congress leaders participating in the bandh

(ప్ర‌జాల‌క్ష్యం ప్ర‌తినిధి)
గోదావరిఖని, డిసెంబ‌ర్ 8ః కేంద్ర ప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మంగళవారం చేపట్టిన భారత్‌ బంద్‌లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటిస్తూ పాల్గొంది. చౌరస్తా నుండి బైక్ ర్యాలీగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఫైయింక్లైన్, విఠల్ నగర్, తిలక్ నగర్, రమేష్ నగర్, కళ్యాణ్ నగర్, లక్ష్మినగర్ ఏరియాలో తీరిగి షాపులను బంద్ చేయించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ రామగుండం కార్పోరేషన్ అధ్యక్షుడు బోంతల రాజేష్, మహంకాళి స్వామి మాట్లాడుతూ.. రైతు వ్యతిరేక చట్టాలతో కేంద్రం వ్యవసాయన్ని కార్పొరేట్ వ్యవస్థలకు దారాదత్తం చేసే ప్రయత్నం చేస్తోందని దేశానికి రైతు వెన్నెముక అని, దేశ వ్యాప్తంగా రైతన్న తీవ్ర ఇబ్బందులు పడుతు న్నాడని అన్నారు. వ్యవసాయ చట్టాలతో రైతులు నడ్డి విరుగుతోందని, రాజ్యసభలో అన్ని పార్టీలు వ్యతి రేకించినా చట్టాలను ఆమోదించుకున్నారని దుయ్యబట్టారు. సంఖ్యా బలం ఉందని ఈ నల్ల చట్టాలను తీసుకొచ్చారని, చట్టాలను వెనక్కి తీసుకోవాల‌ని డిమాండ్‌ చేశారు. దేశంలో రైతులను ఆదుకున్న ప్రభు త్వం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాశ్, ఎండీ ముస్తాఫా, గాదం విజయ, బొమ్మక రాజేష్, గట్ల రమేష్, యుగెందర్, పంజా శ్రీనివాస్, నాజిమ్, బెంద్రం రాజిరెడ్డి, స్వప్న, నాజిమొద్దిన్, ఎర్ర మధు, కౌటం సతీశ్, అంబటి శ్రావణ్, పీక అరుణ్ కుమార్, రంజిత్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here