– బతుకమ్మ చీరల పంపిణీపై సమీక్ష
– రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని అక్టోబర్ 8: పువ్వులను పూజించే సంస్కతి తెలంగాణ ప్రజలదని, తెలంగాణ రాష్ట్రంలో పేద ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందిస్తూ ఆడపడుచులకు పెద్దన్నగా మారారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల తహశీల్దార్లు, రేషన్ డీలర్లతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో బతుకమ్మ చీరల పంపిణీపై ఎమ్మెల్యే మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సిఎం కేసీఆర్ పేద ప్రజల అభ్యున్నతి, సంక్షేమంతో పాటు పేదింటి ఆడపడుచులకు బతుకమ్మ చీరలను గత 6 సంవత్సరాల కాలంగా అందించడం జరుగుతుందన్నారు. తెలంగాణ జాగతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తెలంగాణ సంస్కతిని ప్రపంచాన్ని చాటిచెప్పిన విధంగా గొప్పగా బతుకమ్మ పండుగను నిర్వహించడం జరగుతుందన్నారు. కారోనా లాక్‌డౌన్ సమయంలో తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలు అర్ధాకలితో కష్టపడకూడదని రేషన్ దుకాణాల ద్వారా తెల్లకార్డుదారులకు ఒక్కొక్కరికి 12 కేజీల బియ్యాన్ని ఉచితంగా అందించామని తెలిపారు.
కరోనా సమయంలో రేషన్ బియ్యం పంపిణీలో ఎన్ని ఇబ్బందులు ఎదురయిన రేషన్ డీలర్లు బియ్యం పంపిణి చేయడం జరిగిందన్నారు. అదే తరహాలో లబ్ధిదారులైన ఆడ పడుచులకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలసి బతుకమ్మ చీరలను పంపిణీి చేయాలన్నారు. రామగుండం నియోజవర్గానికి 80 వేల563 బతుకమ్మ చీరలు రావడం జరిగిందని, చీరల పంపిణిలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత అధికారులు, రేషన్ డీలర్లు చూసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మండల తహశీల్దార్లు బండి ప్రకాష్, రమేష్, అధికారులు సురేష్‌తో పాటు రేషన్ డీలర్లు పాల్గొన్నారు.