Home తెలంగాణ ఈ నెల 23న లాభాల బోనస్‌

ఈ నెల 23న లాభాల బోనస్‌

661
0
Singareni C&MD N. Sridhar

– 23నే మినహాయించిన మార్చి నెల జీతం చెల్లింపు
– 19న దసరా అడ్వాన్సు 25 వేలు
– సింగరేణి సి&ఎండి ఎన్‌.శ్రీధర్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైదరాబాద్‌, అక్టోబర్‌ 13: సింగరేణి ఉద్యోగులకు ఈ నెల 23న లాభాల బోనస్‌ను చెల్లించనున్నట్లు చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌.శ్రీధర్‌ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేసారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో సంస్థ ఆర్జించిన 993.86 కోట్ల రూపాయల నిఖర లాభంలో 28 శాతం… అంటే 278.28 కోట్ల రూపాయలు ఉద్యోగులకు బోనస్‌గా ఈ నెల 23న పంపిణి చేయ నున్నట్లు తెలిపారు. ప్రతి ఉద్యోగికి సగటున 60,468 రూపాయల లాభాల బోసన్‌ అభించే అవకాశముందని పేర్కొన్నారు.

కరోనా నేపథ్యంలో మార్చి జీతాల్లో మినహాయించిన జీతాన్ని కూడా ఈ లాభాల బోనస్‌తో పాటు కలిపి 23న ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా ప్రతీ ఏడాది మాదిరిగానే ఈసారి దసరా పండుగ అడ్వాన్సు సొమ్మును ఒక్కొక్కరికి 25 వేల రూపాయలను ఈ నెల 19న ఉద్యోగుల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందని వివరించారు.

కోవిడ్‌-19 నేపథ్యంలో కంపెనీ యొక్క ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా ఉన్న ప్పటికీ కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని గత ఏడాది మాదిరిగానే 28 శాతం లాభాల బోనస్‌ ఈ ఏడాది కూడా చెల్లించడానికి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఆదేశించారని తెలిపారు. అందుకు కార్మికుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతియేడు లాభాల శాతం పెంచుతూ వస్తున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012-13లో 18 శాతం వున్న లాభాల వాటా రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కార్మికులపై వున్న ప్రత్యేకమైన అభిమానంతో 2013-14లో దానిని 20 శాతానికి (83.65 కోట్ల రూపాయలు) పెంచారు. అలాగే 2014-15లో 21 శాతం (103 కోట్ల రూపాయలు), 2015-16లో 23 శాతం (245 కోట్ల రూపాయలు). 2016-17లో 25 శాతం (98.85 కోట్ల రూపాయలు), 2017-18లో 27 శాతం (326.25 కోట్ల రూపాయలు) 2018-19లో 28 శాతం (476 కోట్ల రూపాయలు) చెల్లించారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here