– కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్‌రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 19: పోలీస్ శాఖలోని వివిధ విభాగాలకు చెందిన పోలీసులు పరస్పర సహకారంతో ఆరోగ్యకరమైన పోటీని ఏర్పరుచుకుని నేరాలను చేధించాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి అన్నారు. ఏ విభాగం పోలీసులు అయినా నేరాలు చేధించడం ద్వారా పోలీస్‌శాఖకు గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు.
ఇటీవల కాలంలో నేరాల చేధనలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులకు పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి శనివారం కమిషనరేట్ కేంద్రంలోని లాంజ్‌లో రివార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్నివిభాగాలకు చెందిన పోలీసులు పరస్పర సహకారం అంకితభావంతో పనిచేయడం వల్లనే ఈ కేసుల చేధన సులభతరమవుతుందన్నారు.
ఎలాంటి నేరాన్నైనా పక్కాప్రణాళికతో ముందుకుసాగితే చేధించవచ్చని చెప్పారు. ప్రయత్నంచేస్తే అసాధ్యం అంటూ ఏదీఉండదని పేర్కొన్నారు. నేరస్థులు పట్టుబడి శిక్షింపబడటం ద్వారా నేరాలు నియంత్రణలోకి వస్తాయని చెప్పారు.
నేరాల చేధన కోసం ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడంతోపాటు టెక్నాలజీని వినియోగించు కోవాలని సూచించారు. టెక్నాలజీవినియోగం ద్వారా నేరాలను సులువుగా చేధించే అవకాశంఉందని చెప్పారు. నేరాలను చేధించడం, నిందితులకు శిక్షలుపడే విషయంలో కీలకపాత్రపోషించే అన్నిస్థాయిలకు చెందిన పోలీసులకు రివార్డులను అందజేస్తామని తెలిపారు. రివార్డులను అందుకోవడం పోలీసులు నేరాల చేధనకోసం పోటీపడాలని పిలుపునిచ్చారు.
నేరాల చేధనకు ఆకాశమే హద్దుగా లక్ష్యంగా పెట్టుకుని ముందుకుసాగాలన్నారు. నేరాల ఛేదన, నిందితులకు శిక్షలుపడే విషయంలో కీలకపాత్ర పోషించే పోలీసులకు రివార్డులను అందజేయడంతోపాటు ప్రభుత్వం అసాధారణ సేవలకు అందించే వివిధ పతకాల ఎంపికకు వారిపేర్లను ప్రతిపాదిస్తామని హామీఇచ్చారు.