Home తెలంగాణ అనుమానితుల కదలికలపై సమాచారం అందించాలి

అనుమానితుల కదలికలపై సమాచారం అందించాలి

618
0
CCS Inspector
CCS Inspector Juvvaji Suresh

– కరీంనగర్‌ సీసీిఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ జవ్వాజి సురేష్‌

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్‌, సెప్టెంబర్‌ 20: అనుమానితుల కదలికలపై సమాజంలోని అన్నివర్గాలకు చెందిన ప్రజలు పోలీసులకు సమాచారం అందించాలని కరీంనగర్‌ సీసీఎస్‌ ఇన్స్‌పెక్టర్‌ జవ్వాజి సురేష్‌ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో ఆయన ప్రజలను కోరారు. ప్రజలు అందించే అనుమానితుల కదలికల సమాచారం ద్వారా నేరాలు చేధించబడే అవకాశం ఉందని చెప్పారు.

నేరాలు చేధించబడి, నిందితులు శిక్షింపబడటం ద్వారా నేరాలు నియంత్రణలోకి వస్తాయన్నారు. ఎక్కడెక్కడో నేరాలకు పాల్పడిన నిందితులు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో ఎవరికీ అనుమానం రాకుండా తలదాచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమప్రాంతాల్లో కొత్తవ్యక్తుల సంచారం అనుమానాస్పదంగా ఉన్నట్లైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. నేరాల చేధనకోసం సీసీిఎస్‌ పోలీసులు రేయింబవళ్ళు శ్రమిస్తున్నారని తెలిపారు. అనుమానితుల కదలికలపై ప్రజలు అందించే సమాచారం విలువైందని పేర్కొన్నారు.

నేరాల చేధనకోసం అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో పోలీస్‌శాఖ ముందుకుసాగు తోందని చెప్పారు. వివిధరకాల నేరాలు జరుగడం ద్వారా శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని, నేరాలు చేధించబడి నిందితులు శిక్షింపబడటం ద్వారా నేరాలు నియంత్రణలో ఉండి శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి సమాచారం అయినా 9440795153 నెంబర్‌కు సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారిపేర్లను గోప్యంగా ఉంచడంతోపాటు నగదు పారితోషికం అందజేస్తామని ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here