– కరీంనగర్ మేయర్ వై. సునీల్ రావు
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, అక్టోబర్ 10: గాన గాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం స్వర ప్రపంచానికి తీరని లోటని కరీంనగర్ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. శనివారం ఫిలింభవన్ లో కరీంనగర్ జిల్లా ఆర్కెస్ట్రా కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాలసుబ్రహ్మణ్యం, కరీంనగర్ గాయకుడు రాసమల్ల రవిల సంతాప సభను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమంలో పాల్గొని మేయర్ పాల్గొని వారికి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ వివిధ భాషల్లో 40వేలకు పైగా పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం గాన ప్రపంచానికి తీరని లోటని తెలిపారు. గాయకునిగా, నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, సంగీత దర్శకులుగా సినీ ప్రపంచంలో మకుటం లేని మహరాజుగా వెలుగొందారని కొనియాడారు. కరీంనగర్ కళాకారుడు రాసమల్ల రవి లేని లోటు తీరలేనిది అని అన్నారు. కళాకారులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఈవెంట్ ఇండిస్ట్రీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గోగుల ప్రసాద్, కళాకారులు సిద్ది రమేష్, గొల్లపెళ్లి రవీందర్, మోహన స్వామి, ప్రవీణ్, ఎం.డి..అభి, శ్రీకాంత్, రవి, శ్రీనివాస్, సంగేo రాధాకృష్ణ, మధు, విఠల్, శంకర్, శ్రీనివాస్, ఆనందా చారి, విజయ్ జితేందర్ ప్రణయ్ శోభ అబ్దుల్ కలాం సాయి, టి.సంతోష్ తదితరులు పాల్గొన్నారు.