– సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 10: ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, వాటిని సంరక్షంచే బాధ్యత తీసుకోవాలని సింగరేణి డైరెక్టర్ ఎన్. బలరాం అన్నారు. భారత ప్రభుత్వం అదేశానుసారంగా జాతి పితా మహాత్మా గాందీ 151వ జన్మదినం సందర్బంగా నీరు, పారిశుధ్యం, పరిసారాలు పరిశుభ్రంగా ఉంచుట కొరకు స్వచ్చతా హి సేవా 2020 పురస్కరించుకొని స్వచ్చతా మాసోత్సవాల భాగంగా శనివారం ఆర్జీవన్ ఏరియా హాస్పిటల్ లో స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథిదీ గా డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం హాజరై ఉద్యోగులచే ప్రతిజ్ణ చేసి, మొక్కలు నాటారు.
ఈ సంధర్బంగా డైరెక్టర్ ఫైనాన్స్ ఎన్.బలరాం మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా పచ్చ దనాన్ని పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని తెలిపారు. స్వచ్చతా హి సేవా ఒక గొప్ప కార్యక్రమమని, గాందీజి కళకు కన్న భారత దేశం నిర్మాణంలో స్వచ్చతా మాసోత్సవాలు ముఖ్య భూమికను పోషింస్తునదని పేర్కొన్నారు.
ఆరోగ్యకరపైన జీవనం గడపాలంటే మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ భాద్యతగా మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణలో భాగం పంచుకోవాలని కోరారు. గృహాలను ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో ఆదే స్థాయిలో మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని, పర్యావరణకు రక్షణకై తమ వంతు భాద్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అర్జీ–1 ఏరియా జియం కె నారాయణ, టి.బి.జి.కె.ఎస్ ఉపాధ్యక్షులు గండ్ర దామోదర్ రావు, ఏ.సి.ఏం.ఒ వెంకటేశ్వరావు, పర్సనల్ మేనేజర్ రమేశ్ , ఫిట్ సెక్రటరీ రత్న మాల ,డాక్టర్లు డా.రవీందర్ , డా.మద్దిలేటి , డా.మదుకుమార్ , డా.నరేశ్ , డా.ఇంద్ర ,మా(టిన్ రుతుమని , యాదవ రెడ్డి, సంక్షేమాధికారి శ్రీనివాస్ అధిక సంఖ్యలో ఉధ్యోగులు పాల్గొన్నారు