Home తెలంగాణ గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులుగా ‘వంశీ’

గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షులుగా ‘వంశీ’

676
0
Vamshi elected as Godavarikhani Press Club president

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, నవంబర్‌ 9: గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌కు ఆదివారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షులుగా మల్లావజ్జుల వంశీ, ప్రధానకార్యదర్శిగా పూదరి కుమార్‌గౌడ్‌, జాయింట్‌ సెక్రెటరీలుగా కే.పీ.కుమార్‌, బైరం సతీష్‌ ఘన విజయం సాధించారు. కోశాధికారి, ఉపాధ్యక్షులు, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీ, ఎగ్జిక్యూటీవ్‌ మెంబర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్య్ష పదవీ కోసం వంశీ, నాయిని మధునయ్య పోటీపడగా, ప్రధానకార్యదర్శి పదవీకి పూదరి కుమార్‌గౌడ్‌, ముచ్చకుర్తి కుమార్‌ పోటీపడ్డారు. జాయింట్‌ సెక్రెటరీలకు కే.పీ.కుమార్‌, బైరం సతీష్‌, భాస్కర్‌ పోటీ పడ్డారు.

వంశీ తన సమీప అభ్యర్థి నాయిని మధునయ్యపై విజయం సాధించగా, పూదరి కుమార్‌గౌడ్‌ ముచ్చకుర్తిపై గెలుపు సాధించారు. అదే విధంగా జాయింట్‌ సెక్రెటరీలుగా కేపీ కుమార్‌, బైరం సతీష్‌ విజయం సాధించారు. అధ్యక్షులుగా ఎన్నికైన వంశీ మాట్లాడుతూ క్లబ్‌ సంక్షేమానికి ఎల్లవేళల పాటుపడుతానని తెలిపారు. క్లబ్‌ సభ్యులు నూతన కార్యవర్గంపై పెద్ద బాధ్యత పెట్టారన్నారు. తూచ తప్పకుండా క్లబ్‌ సభ్యుల సంక్షేమానికి, నూతన ప్రెస్‌క్లబ్‌ భవన నిర్మాణం పూర్తి చేయడానికి అంకితభావంతో పనిచేస్తామన్నారు. నూతన కార్యవర్గ భుజస్కందాలపై పెట్టిన సమస్యలను పరిష్కరించేందుకు నూతన కార్యవర్గం శక్తివంచనలేకుండా పనిచేస్తుందన్నారు.

క్లబ్‌ సభ్యుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామన్నారు. త్వరితగతిన క్లబ్‌ నూతన భవనం పూర్తి చేస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌కు ఒక ప్రత్యేక వుందని, ఆ ప్రత్యేకతను ఇంకా ఇనుమడింపజేస్తామన్నారు. రాష్ట్రంలోని ప్రెస్‌క్లబ్‌లు గోదావరిఖని ప్రెస్‌క్లబ్‌ ను ఆదర్శంగా తీసుకునే విధంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నూతన కార్యవర్గంపై నమ్మకం వుంచి గెలిపించి ప్రెస్‌క్లబ్‌ సభ్యులకు పేరు పేరున వంశీ కృతజ్ఞతలు తెలిపారు.

క్లబ్‌ నూతన కార్యవర్గం: అధ్యక్షులుగా ఎం.వంశీ, ప్రధానకార్యదర్శిగా పూదరి కుమార్‌గౌడ్‌, కోశాధికారిగా దయానంద్‌గాంధీ, ఉపాధ్యక్షులుగా పందిళ్ల శ్యాంసుందర్‌, మామిడి కుమార్‌, టి.రాజ్‌కుమార్‌, గసిగంటి రవీందర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రెటరీగా గోలి సమ్మిరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా బైరం సతీష్‌కుమార్‌, కే.పీ.కుమార్, దాట్ల జేమ్స్‌రెడ్డి, గడ్డం శ్యాంకుమార్‌ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పి.రాజేందర్‌, ఎస్‌.కుమార్‌, డి.మాదవరావు, నాగపురి సత్యనారాయణ, డి.చంద్రశేఖర్‌, ఎస్‌.తిరుపతిరెడ్డి, పెద్దపల్లి సత్యనారాయణ, దబ్బెట శంకర్‌, ఎ. సుధీర్‌బాబు, సీపెల్లి రాజేషం, వేముల రమణయ్య, జడల సంపత్‌ కుమార్‌, ముల్కల ప్రసాద్‌, కాశెట్టి శివలింగం, మాటేటి శ్రీనివాస్‌, గసికంటి రవీందర్‌, డి. సంతోష్‌ కుమార్‌, కోదాది కుమార్,‌ మామిడి సత్యం, జాన్‌సుందర్‌, కొండాల్‌రెడ్డి, జి.శ్యాంసుందర్‌, పాలకుర్తి విజయకుమార్‌, ఎ.కుమార్‌, ఇజయగిరి సమ్మయ్య, సురభి శ్రీధర్‌ ఎన్నికయ్యారు. సాంస్కృతిక కన్వీనర్‌గా కె.ఎస్‌.వాసు, కో-కన్వీనర్లుగా రాంశంకర్‌, ఎలిగేటి శంకర్‌ ఎన్నికయ్యారు. కాగా ఎన్నికల అధికారులగా పిట్టల రాజేందర్‌, అల్లెంకి లచ్చయ్య, పాలకుర్తి విజయకుమార్‌ వ్యవహరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here