– యువజన కాంగ్రెస్ నేత అరుణ్‌కుమార్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, మార్చి 22: గోదావరినది ఆత్మహత్యలకు అడ్డగా మారిందని గోదావరిబ్రిడ్జిపై రెయిలింగ్ పైన ఫెన్సింగ్ తక్షణమే ఏర్పాటు చేయాలని యువజన కాంగ్రెస్ నాయకులు పీక అరుణ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఎళ్లవేళ నిండు కుండల మారి చూడటానికి అందంగా కనిపిస్తు ఎన్నో అందాలను గోదావరి నది సొంతం చేసుకుందని పేర్కొన్నారు. కానీ దురదష్టశాత్తు ఇప్పుడు గోదావరి బ్రిడ్జి సూసైడ్ స్పాట్‌గా మారిందని అన్నారు. గోదావరినది బ్రిడ్జిపై రెయిలింగ్ పైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఆత్మహత్యలు నివారించి, ప్రజల ప్రాణాలు కాపాడాలని పాలక వర్గాన్ని కోరారు.
ఇటీవల కాలంలోనే కొంత మంది బాధితులు వారి కుటుంబ కలహాలతో మరియు ఇతరత్ర సమస్యలతో క్షణికావేశంలో గోదావరి బ్రిడ్జి దగ్గరికి వచ్చి నీటిలో దూకి ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. విధుల్లో ఉన్న రివర్ పోలీసులు కొంత మందిని కాపాడే ప్రయత్నం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఆత్మహత్యలకు నిలయంగా మారిన గోదావరి బ్రిడ్జి రేలింగ్‌పై వెంటనే పెన్సింగ్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ విషయమై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి వెంటనే స్పందించి ప్రజలకు రక్షణ కల్పించి, ఆత్మహత్యలు నివారించాలని కోరారు.
వివిధ పుణ్యక్షేత్రాల దగ్గర నీటి సమీపంలో చుట్టూ ఫెన్సింగ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారో ఈ బ్రిడ్జి వాల్ పైన పది ఫీట్ల ఎత్తు వరకు పెన్షింగ్ ఏర్పాటుచేస్తే ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి ఫెన్సింగ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని కోరారు.