Home తెలంగాణ నవంబర్‌ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలి

నవంబర్‌ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలి

532
0
Union Ministers visiting
Union Minister of State for Chamicals and Fertilizers Man Sukh Mandavya speaking

– కేంద్ర రసాయనాలు ఎరువుల శాఖ సహాయ మంత్రి మాన్‌ సుఖ్‌ మాండవ్యా
– 99శాతం నిర్మాణ పనులు పూర్తి
– 2200 మెట్రిక్‌ టన్నుల అమ్మోనియా, 3850 మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి
– నీరు, కరెంట్‌, గ్యాస్‌ కనెక్టివిటీ పనులు పూర్తి
– కరోనా కారణంగా 3 నెలలు ఆలస్యం
– ప్రతి సంవత్సరం 12.5 లక్షల యూరియా ఉత్పత్తి

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సప్టెంబర్‌ 12: ఎరువు కర్మాగారం నిర్మాణం చివరి పనులు త్వరితగతిన పూర్తిచేసి నవంబర్‌ నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని కేంద్ర ఎరువుల రసాయనాల శాఖ సహాయ మంత్రి మాన్‌ సుఖ్‌ మాండవ్యా సంబంధిత అధికారులకు సూచించారు. రామగుండంలో నిర్మిస్తున్న ఎరువుల కర్మాగారాన్ని శనివారం ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి, జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధుతో కలిసి సందర్శించారు. ఎరువు కర్మాగారం నిర్మాణ పనులకు సంబంధించి పురోగతిపై సంస్థ ప్రతినిధులు పిపిటి ద్వారా వివరించారు.

1985లో మూసివేసిన ఎరువుల కర్మాగారాన్ని పునరుద్ధరించాని, ఎన్టీపీసీలో అదనపు పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయాలనే తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్ష మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అందించారని తెలిపారు. రూ.6120.5 కోట్ల నిర్మాణంతో చేపట్టిన ఎరువుల కర్మాగార పునరుద్ధరణ పనులు 99% పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. ఎరువుల కర్మాగారానికి అవసరమైన నీటి సరఫరా, విద్యుత్‌ సరఫరా, గ్యాస్‌ సరఫరా పనులు పూర్తి చేశామని అన్నారు.

కరోనా నేపథ్యంలో ప్లాంట్‌ కమిషన్‌ పనులు 3 నెలల పాటు ఆస్యమవుతున్నాయని, విదేశాల నుంచి నిపుణుల సహకారం సాంకేతికతను వినియోగిస్తూ తీసుకుంటున్నామని తెలిపారు. అమ్మోనియా ప్లాంటు నిర్మాణ పనులు, యూరియా ప్లాంట్‌ నిర్మాణ పనులు పూర్తిచేసి నవంబర్‌ నుంచి ఎరువుల ఉత్పత్తి ప్రారంభించాలని సూచించారు.

అక్టోబర్‌లో ఎరువుల ఉత్పత్తి ప్రారంభించి నవంబర్‌ నాటికి స్టెబిలైజేషన్‌ పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రతి సంవత్సరం 12.5 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని, అందులో 6.25 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా తెలంగాణకు కేటాయించబడుతుందని అన్నారు. ఎరువుల కర్మాగారం నిర్మాణం పూర్తయితే వ్యవసాయరంగానికి ఎరువుల కొరత సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుందని అన్నారు. అనంతరం కేంద్ర సహాయ మంత్రులు రామగుండంలో నిర్మిస్తున్న ఎరువు కర్మాగారం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

కేంద్ర ఎరువుల రసాయనా శాఖ సహాయ మంత్రి మాన్‌ సుఖ్‌ మాండవ్యా మాట్లాడుతూ రైతు ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాణ్యమైన ఎరువును రైతులకు సకాలంలో అందించడానికి అవసరమైన చర్యులు తీసుకుంటున్నారని తెలిపారు. దేశ వ్యాప్తంగా రైతులు సుమారు 4 కోట్ల మెట్రిక్‌ టన్నుల యూరియా వినియోగిస్తారని, అందులో నుండి 2.5 కోట్ల యూరియా దిగుమతి చేసుకుంటామని, స్థానికంగా యూరియాను ఉత్పత్తి చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా 5 ఎరువు కర్మాగారం ప్లాంట్లను నిర్వహిస్తున్నారని తెలిపారు.

రామగుండం ఎరువుల కర్మాగారం ప్లాంట్‌ 99% పూర్తయిందని, రెండు మాసాల్లో ఎరువు ఉత్పత్తి ప్రారంభమవుతుందని తెలిపారు. రైతు వినియోగించే ఎరువుల బస్తాపై కేంద్ర ప్రభుత్వం రూ 600/- నుంచి రూ 700/- సబ్సిడీ అందిస్తుందని, ఎరువు ప్లాంట్‌ ఉత్పత్తి ప్రారంభం అయితే స్థానిక రైతులకు అవసరమైన యూరియా ప్లాంట్‌ నుండి సరఫరా చేస్తామని తెలిపారు. ఎరువు కర్మాగారం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, ఉత్పత్తి ప్రారంభమయిన తరువాత మరో 700 లేదా 800 మందికి అదనంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని, వాటిని స్థానికులకు అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. ఎరువుల కర్మాగారం స్థానికంగా ఆర్థిక పురోగతి సైతం ఉంటుందని, దీని ద్వారా పరోక్షంగా ఉపాధి అవకాశాు జీవన ప్రమాణాు స్థానిక ప్రజ మెరుగుపడతాయని తెలిపారు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి , కేంద్ర ప్రభుత్వ ఎరువుల శాఖ అదనపు కార్యదర్శి ధర్మాపిల్‌ జిల్లా కలెక్టర్‌ భారతి హోళీ కేరి, రామగుండం మున్సిపల్‌ కమిషనర్‌ ఉదయ్‌ కుమార్‌, ఈడీ ఆర్‌ఎఫ్‌సిఎల్‌ రాజన్‌ తపర్‌, జనరల్‌ మేనేజర్‌ వి.కే బంగార్‌, ప్రొడక్షన్‌ మేనేజర్‌ ఎస్‌.కే.జా, చీఫ్‌ మేనేజర్‌, ఆర్‌ఎఫ్‌సిఎల్‌ అధికారులు నిర్లిప్‌ సింగ్‌ రాయ, సుదర్శన్‌ కుమార్‌ రాజేంద్రన్‌ సంబంధిత అధికారులు, తదితయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here