82,920 రూపాయల నగదు స్వాధీనం
పట్టుబడిన వారిలో ఇద్దరు ప్రజాప్రతినిధు
(ప్రజాక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 12: తిమ్మాపూర్ మండంలోని రామకృష్ణాపూర్ కానీ శివారులోని ఒకపశువుల కొట్టంలో పేకాట ఆడుతున్న 10మందిని శుక్రవారంనాడు టాస్క్‌ఫోర్స్ అధికారులు పట్టుకున్నారు. ఇందులో ఇద్దరు ప్రజాప్రతినిధులు ఉన్నారు. ఈ మేరకు ఎల్‌యండి పోలీస్‌స్టేషన్‌లో కేసు సమోదుచేసారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామకృష్ణాపూర్‌కానీలో ఒకపశువు కొట్టంలో పేకాట ఆడుతున్నారని అందిన సమాచారం మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పేకాట ఆడుతున్న తిమ్మాపూర్‌కు చెందిన గంగిడి సత్యనారాయణరెడ్డి, నల్లగొండ సర్పంచ్ భర్త దన్నమనేని నర్సింగరావు, ఇందిరానగర్‌కు చెందిన సుంక నరేందర్, కరీంనగర్ పాతబజార్‌కు చెందిన బోడ సుధాకర్‌రెడ్డి, రామకృష్ణాపూర్‌కానీకి చెందిన దావు సంపత్‌రెడ్డి, దావు రాజిరెడ్డి, కట్టరాంపూర్‌కు చెందిన పెండ్యా శ్యాంకుమార్, తిమ్మాపూర్‌కు చెందిన గంగిడి పాపిరెడ్డి, చిగురుమామిడి మండం చిన్నముల్కనూర్‌కు చెందిన మాజీ ఎంపిటిసి ముప్పిడి దేవేందర్‌రెడ్డి, భాగ్యనగర్‌కు చెందిన సంది రాజిరెడ్డిలు పట్టుబడ్డారు. వీరివద్ద నుండి 82,920 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.