Home తెలంగాణ మాజీ మంత్రి ‘మాతంగి నర్సయ్య’ ఇక లేరు…

మాజీ మంత్రి ‘మాతంగి నర్సయ్య’ ఇక లేరు…

778
0
Mathangi Narsaiah
Mathangi Narsaiah (file)

– మేడారం నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా మాతంగి
– సంతాపం తెలిపిన ప్రముఖులు

(ప్రజాక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 1: రామగుండం పారిశ్రామిక ప్రాంతం గోదావరిఖని పట్టణం కాకతీయనగర్‌లో నివాసముంటున్న రాయకీయ కురువృద్ధుడు, మాజీ మంత్రి మాతంగి నర్సయ్య (80) మంగళవారం సాయంత్రం మృతి చెందారు. గత 15 రోజు క్రితం మాతంగి నర్సయ్య సతీమణి జోజమ్మ మృతి చెందడంతో ఆయన మానసికంగా కృంగిపోయారు. దాంతో పాటు అనారోగ్యం తోడుకావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మాతంగి నర్సయ్య వైద్యం తీసుకుంటూ… మృతి చెందారు. ప్రస్తుతం రామగుండం నియోజకవర్గంగా ఉన్న ఈ ప్రాంతం గతంలో మేడారం నియోజకవర్గ పరిధిలో ఉండేది. మేడారం నియోజకవర్గం నుంచి 1983, 1989, 1999లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. నాదేండ్ల భాస్కర్‌రావు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఒకనెల రోజుల పాటు మంత్రిగా మాతంగి నర్సయ్య పనిచేశారు. టీడీపీలో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదించిన మాతంగి నర్సయ్య మారుతున్న కాలానికి అనుగుణంగా కాంగ్రెస్‌ పార్టీలో కూడా చేరారు. వివిధ పార్టీలో ఉన్నా అన్ని వర్గాల ప్రజలతో ఆయనకు సత్ససంబంధాలు ఉండేవి. రామగుండం నోటిఫైడ్‌ ఏరియా కమిటి చైర్మన్‌గా కూడా రెండుసార్లు ప్రాతినిధ్యం వహించారు. సుల్తానాబాద్‌ మండం రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన మాతంగి నర్సయ్య తన విద్యభ్యాసాన్ని పెద్దపల్లిలోని అమ్మమ్మ ఇంటి వద్ద కొనసాగించారు. మాతంగి నర్సయ్య ఎల్‌ఎల్‌బీ చేశారు. బ్యాంక్‌ ఉద్యోగిగా కూడా పనిచేశారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రతి ఒక్కరిని ప్రేమ, ఆప్యాయతతో అన్న, అక్క, మామ, అల్లుడు అంటూ.. వరుసతో సంబోధించేవారు. రామగుండం రాజకీయాల్లో రాజకీయ కురువృద్దుడు మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మరణించడంతో ఈ ప్రాంతవాసు పువురు ఆవేదన వ్యక్తం చేశారు. మేడారం నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాను చేపట్టి పలువురి మన్ననలను మాతంగి నర్సయ్య పొందారు. కార్మిక క్షేత్రంలో మాతంగి చేసిన సేమ అమోఘమని ఆయన అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. మాతంగి మృతిపట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

సంతాపం తెలిపిన రామగుండం ఎమ్మల్యే కోరుకంటి చందర్

మాజీ మంత్రి మాతంగి నర్సయ్య మృతికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సంతాపం తెలిపారు. సుధీర్ఘ రాజకీయాలలో అందరితో కలివిడిగా వున్న మాతంగి నర్సయ్య మృతి రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి తీరని లోటని పెర్కొన్నారు. మాతంగి ఆత్మకు శాంతి చేకురాలనీ  ఆయన కుటుంబానికి ప్రగాఢ సాతుభూతి తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here