Home తెలంగాణ ప్యారడైజ్ హోటల్ కి లక్ష జరిమానా

ప్యారడైజ్ హోటల్ కి లక్ష జరిమానా

624
0
ghmc fines one lakh rupees to paradise hotel
ghmc fines one lakh rupees to paradise hotel

బిర్యానీ అంటే వెంటనే గుర్తొచ్చే పేరు ప్యారడైజ్.. దేశంలోనే ఈ రెస్టారెంట్ చాలా ఫేమస్.. ఐతే ప్యారడైజ్ బిర్యానీలో వెంట్రుక రావడం హైదరాబాద్‌లో కలకలం రేపింది.

సికింద్రాబాద్ ప్యారడైజ్ రెస్టారెంట్‌లో బిర్యానీలో వెంట్రుక వచ్చిందని ఓ వ్యక్తి అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. హోటల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో అతడు జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు ఇచ్చాడు. బిర్యానీలో వెంట్రుక వచ్చిందని చూపించగా హోటల్ పీఆర్ రాఘవ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారని బాధితుడు వెల్లడించాడు.

దాంతో హెల్త్ అధికారి, ఫుడ్ ఇన్ స్పెక్టర్, శానిటేషన్ అధికారి హోటల్‌కు చేరుకొని తనిఖీలు చేశారు. కిచెన్‌‌లో అపరిశుభ్రత, వంట సామాగ్రిలో నాణ్యాత లేకపోవడం వంటి కారణాలతో రూ. లక్ష జరిమానాతో పాటు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో పరిశుభ్రత విషయంలో లోపాలు సరిచేసుకోవాలని.. ప్రస్తుతం జరిమానాతో సరిపెడుతున్నామని , లేదంటే హోటల్‌కు తాళం వేస్తామని హెచ్చరించారు.

బిర్యానీలో వెంట్రుక రావడంతో లక్ష రూపాయల జరిమానా విధించిన అంశం నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. అంత్యంత క్వాలీటీగా ఉండే ప్యారడైజ్ హోటల్ కూడ ఇలాంటీ సంఘటనలు జరగడంతో వినియోగదారులు ఓకింత ఆసహనానికి గురవుతున్నారు. కనీసం ఇలాంటీ పెద్దస్థాయి హోటళ్లలోనైనా పరిశుభ్రంగా ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వినియోగదారులు కోరుతున్నారు.

కేఫ్ బహార్ హోటల్ కి కూడా

సరూర్ నగర్‌ పరిధిలోని బైరామల్‌గూడలో కేఫ్ బాహర్ హోటల్‌కు కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. సరైన ట్రేడ్ లైసెన్స్ లేకుండానే హోటల్‌ను నిర్వహించడం, హోటల్‌లో శుభ్రత పాటించపోవడం, చెత్తను వేరు చేయకపోవడం లాంటి కారణాలను గుర్తించి జీహెచ్‌ఎంసీ అధికారులు ఫైన్ విధించారు.

GHMC fine one lakh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here