సూర్యాపేట : హుజూర్ నగర్ లో ఉప ఎన్నికల్లో టి ఆర్ ఎస్ విజయం ఖాయమని టి ఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, హుజూర్ నగర్ ఇంచార్జి , ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగల గణేష్ గుప్త , తెలంగాణ పోలీస్ హోసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ సభ్యులు ముర్రంశెట్టి రాములు, ఆగ్రో ఇన్పుట్ డీలర్స్ జాతీయ ఉపాధ్యక్షులు గౌరిశెట్టి మునీందర్, హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ బొల్లం సంపత్, వరంగల్ మేయర్ గుండా ప్రకాష్ రావు, సోమ భరత్ కుమార్, గుడాల భాస్కర్ లతో కలిసి ప్రచారం చేసినట్లు ఆయన వివరించారు.
కెసిఆర్ మరియు కేటీర్ అప్పగించిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. ఏడు మండలాల్లోని వైశ్య సంఘాలన్నింటిని సంఘటితం చేసి తెరాస ప్రభుతవం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించి ఓట్లు అభ్యర్థించినట్లు తెలిపారు. అధికారపార్టీ అభ్యర్థిని గెలిపించినట్లైతే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని తెలియజేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని పార్టీ అభ్యర్థిని గెలిపించినట్లైతే అభివృద్ధి కుంటుపడుతుందని, అధికారపార్టీ అభ్యర్థి అయిన శానంపూడి సైదిరెడ్డి ని గెలిపించినట్లైతే అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని వివరించినట్లు అయన తెలియజేశారు.
నామినేటెడ్ పోస్టుల్లో వైశ్యులకు టి ఆర్ ఎస్ ప్రభుత్వం సముచిత స్తానం కల్పిస్తున్నదని, త్వరలోనే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయనున్నదని, కుల మతాలకు అతీతంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, రైతు బంధు, రైతు భీమా, డబల్ బెడ్ రూమ్ ఇల్లు, కల్యాణ లక్ష్మి పథకాల గురించి వివరించి వైశ్యుల సమస్యలను కెసిఆర్ మరియు కేటీర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించనున్నట్లు హామీ ఇచ్చినట్లు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గం లోని వైశ్యులు ఘనస్వాగతం పలికారన్నారు. సహాయ సహకారాలందించిన హుజూర్ నగర్ నియోజకవర్గ వైశ్యులందరికి ఆయన కృతఙ్ఞతలు తెలిపారు. హుజూర్ నగర్ టి ఆర్ ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం ఖాయమని అయన అన్నారు.