Home తెలంగాణ సింగరేణి అధికారులతో జీఎం సమీక్షా సమావేశం…

సింగరేణి అధికారులతో జీఎం సమీక్షా సమావేశం…

501
0
Production meeting
RG-I GM K.narayana production meeting with the authorities

సింగరేణి అధికారులతో జీఎం సమీక్షా సమావేశం…

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 1: సింగరేణి ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జీఎం కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేయగా, ఆర్‌జీ-1 పరిధి ఏజంట్లు, మేనేజర్లు పాల్గొన్నారు. ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రక్షణ విషయాలపై సమీక్షించారు.

ఈ సందర్బంగా జీఎం కల్వల నారాయణ ఆర్‌జీ-1 ఏరియాలోని భూగర్భ, ఉపరితల గనుల్లో వస్తున్న ఉత్పత్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జీఎం మాట్లాడుతూ ఈ ఆర్ధిక సంవత్సరంలో 100శాతం ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని అధికారులను ఆదేశించారు. కార్మికులకు అవగాహన కల్పించి ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. గనులు, ఓసీపీల్లో రక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశంలో సింగరేణి ఆర్‌జీ-1 అధికారులు త్యాగరాజు, ఎ.ఆంజనేయులు, బెనర్జీ బెంజిమెన్‌, యం.సురేష్‌, సత్యనారాయణ, మదన్‌మోహన్‌, సరోత్తమ్‌, రమేశ్‌, హరినాధ్‌, వసంత్‌కుమార్‌, నెహ్రు, సాయిప్రసాద్‌, అంజనిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here