(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
హైద్రాబాద్, సెప్టెంబర్ 20: నరేంద్రమోదీ 70 వ జన్మదినం సందర్భంగా ఆదివారం ఉదయం 124 డివిజన్ బీజేవైఎం అధ్యక్షులు రాహుల్ ఆధ్వర్యంలో సేవ సప్తహి కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ టైగర్ అలె నరేంద్ర పార్కులో స్వచ్చ భారత్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్విన్ కాలనీ లోని అన్ని రహదారులు శుభ్రం చేయడం జరిగింది. అలాగే పార్క్ లోని చెత్త చెదారం తొలగించారు. కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు నరేందర్ రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర నాయకులు అరుణ్ కుమార్ గారు హాజరయ్యారు.ఈ సందర్భంగా వీరు మాట్లాడుతు 70 ఏండ్ల నుంచి ఏ ప్రభుత్వం చెయ్యలేని విధంగా మోడీ ప్రభుత్వం అభివృద్ది చేసి చూపించిన నాయకుడు మోడీ అన్నారు. ప్రపంచాన్ని అబ్బుర పరిచేలా మోడీ పాలన సాగుతుంది అన్నారు. పుట్టిన రోజు వేడుకలను కూడా సేవ కార్యక్రమాలుగా ఉండాలని చెప్పిన గొప్ప నాయకుడు మోడీ అన్నారు. కాబట్టి అంత గొప్ప నాయకుని నాయకత్వంలో పని చేయడం మన అదృష్టం అన్నారు..మోడీ గారు భగవంతుని ఆశీసుల తో ఆయురారోగ్యాలతో ఉండి దేశాన్ని మరింత అభివృద్ధి లో వేగంగా ముందుకు తీసుకెల్లాలని కోరుకుంటున్నాం అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు రామరాజు, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కుమార్ యాదవ్, బిజెపి డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి, సీనియర్ నాయకులు మణిభూషన్, రఘు, బీజేవైఎం నాయకులు రఘుశర్మ, రాజు, కమల్, అంజి, అభిలాష్, మహేష్, జి.హెచ్.ఎం.సి. సిబ్బంది, తదితరులు పాల్గొనడం జరిగింది.