– బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎంపీ వెంకటేష్, ఎమ్మెల్యే చందర్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి) :
గోదావరిఖని సెప్టెంబర్ 27: స్వరాష్ట్రం కోసం పరితపించిన తొలితరం ఉద్యమ యోధుడు కొండా లక్ష్మన్ బాపూజీ అని పెద్దపల్లి ఎంపి బోర్లకుంట వెంకటేష్ నేతకాని, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. అదివారం కొండ లక్ష్మన్ బాపుజీ జయంతి సందర్భంగా స్థానిక రాజేష్ థియేటర్ సమీపంలోని బాపూజీ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ఆఖరి శ్వాసవరకు తెలంగాణకై పోరాడిన వ్యక్తని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, సంక్షేమానికి కొండా లక్ష్మన్ బాపూజీ ఎంతో శ్రమించారన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కషి చేయలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పోరేటర్ మంచికట్ల దయాకర్, నాయకులు తానిపార్తి గోపాల్ రావు, నూతి తిరుపతి, వంగ వీరస్వామి, అనుముల కళావతి తదితరులు పాల్గొన్నారు.