Home తెలంగాణ ఆర్జీవన్‌ జియంను సన్మానించిన మంత్రి ఈశ్వర్‌

ఆర్జీవన్‌ జియంను సన్మానించిన మంత్రి ఈశ్వర్‌

491
0
Honors

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్‌ 27, సింగరేణి ఎస్‌.సి. చీఫ్‌ లైజన్‌ ఆఫీసర్‌గా నియమితులైన రామగుండం ఏరియా-1 జియం కల్వల నారాయణను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదివారం సన్మానించారు. యన్‌టిపిసి గెస్ట్‌ హౌస్‌లో జీయం నారాయణ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. సింగరేణిలో రాష్ట్రప్రభుత్వం ద్వారా లభించు హక్కులను, సేవలు అందించేందుకు సహాయ సహాకారాలు అందించాలని మంత్రిని కోరారు.

ఈ సందర్భంగా మంత్రి జీయంను అభినందించి శాలువా కప్పి సన్మానించారు. ఆర్జీవన్‌ ఏరియాకు సంబంధించిన ఉత్పత్తి, ఉత్పాదకత, సంక్షేమ కార్యక్రమాల గురించి, కరోనా నివారణకు తీసుకున్న చర్యల గురించి మంత్రి ఈశ్వర్‌కు జీఎం నారాయణ వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here