– ఏరియా వర్క్ షాప్‌లో స్వచ్చతా కార్యక్రమం
– డీజీయం ఎం.మధన్ మోహన్
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్ 12: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపాడాలని ఏరియా వర్క్‌షాప్ డీజీయం ఎం.మధన్ మోహన్ అన్నారు. భారత ప్రభుత్వం అదేశాను సారం జాతి పిత మహాత్మా గాందీ 151 వ జన్మదినం సందర్బంగా నీరు, పారిశుధ్యం, పరిసారాలు పరిశుభ్రంగా ఉంచుట కొరకు స్వచ్చతా హి సేవా 2020 మాసోత్సవాలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నవి. అందులో భాగంగానే సోమవారం ఏరియా వర్క్ షాప్ నందు స్వచ్ఛతా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని డీజియం ఎం.మధన్ మోహన్ పాల్గొని ఉద్యోగులచే ప్రతిజ్ణ చేయించి ప్రారంభించారు.
ఈ సందర్బంగా డీజియం ఎం.మధన్ మోహన్ మాట్లాడుతూ స్వచ్చతా హి సేవా ఒక గొప్ప కార్యక్రమమని గాందీజి కలలు కన్న స్వచ్చమైన భారత దేశం నిర్మాణంలో స్వచ్చతా మాసో త్సవాలు ముఖ్య భూమికను పోషిస్తున్నదన్నారు. దేశం మొత్తం ఈ స్వచ్చతా మాసోత్స వాలు నిర్వహిస్తుందని తెలిపారు.

తమ గృహాలను ఏ విధంగా అయితే శుభ్రంగా ఉంచుకుంటామో అదే విధంగా ప్రతి ఒక్కరూ విధిగా మన చుట్టూ ఉన్న పరిసరాలను శుభ్రంగా ఉంచు కోవాలని కోరారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ గుడ్డ సంచులను వాడాలని, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూ లించాలని తెలిపారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పాడాలని ప్రతిజ్ణ చేశారు.
ఈ కార్యక్రమంలో డిజియం మధన్ మోహన్, ఫిట్ సెక్రటరీ స్వామి దాస్, జితేందర్ సింగ్ ఎస్.ఈ, శ్రీనివాస్ ఈ.ఈ. మధుసూదన్ రావు ఈ.ఈ. నాగ శంకర్, శ్రీనివాస్, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.