(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
లక్షిట్టిపేట, సెప్టెంబర్ 20:: రైతుల కష్టాలను తీర్చేందుకే ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకొచ్చిందని, ఇది రైతుల పాలిట వరమని పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేత అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షిట్టిపేట మండలం సూరారం గ్రామంలోని రైతు వేదిక నిర్మాణం పనులను మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దికాకర్‌రావుతో కలిసి ఆదివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపి మాట్లాడుతూ ప్రభుత్వం రైతును రాజు చేయాలనే ఉద్ధేశ్యంలో భాగంగానే రైతులను ప్రత్యేక దృష్టితో చూస్తూ ముందుకు సాగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడకూడదని, ఆత్మహత్యలు చేసుకోకుండా వుండేందుకు వారికి సకాలంలో అన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు.
రైతులకు ఇంకా మెరుగైన సేవలందించేందుకు రైతు వేదికల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రైతు వేదిక భవనాలు రైతుల సమస్యలు ఇక్కడ నుండే పరిష్కరించేందుకేనని పేర్కొన్నారు. ఇంత కరువు కష్టకాలంలో కూడా రైతులకు విత్తనాలు, ఎరువులు పూర్తి స్థాయిలో ఇవ్వడం జరింగిందన్నారు. అధికారులు రైతుల మధ్యనే ఉండి వాళ్ళకు ఎలాంటి సమస్య ఏర్పడినా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లయితే ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు.
ప్రభుత్వం రైతుల కోసమే కొత్త రెవెన్యూ చట్టం తీసుకు వచ్చిందన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే కొత్త రెవెన్యూ చట్టం ఉందని, మన ముఖ్యమంత్రిని చూసే ప్రధాన మంత్రి కేంద్రంలో మరో కొత్త చట్టం రైతుల కోసం తీసుకువస్తున్నారని తెలిపారు. కేంద్రం నుండి మనకు రావాల్సిన కోట్ల బకాయిలను వెంటనే ఇవ్వాలని, ఇపుడు నడుస్తున్న పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకు పోతానని తెలిపారు.

అనంతరం ఎంపిని గ్రామ సర్పంచ్ శంకరయ్య, ఎంపిటిసి దావిద్‌లు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న, రైతు సమస్వయ కమిటి జిల్లా అధ్యక్షుడు మోటపల్కుల గురువయ్య, కమిటి మండల అధ్యక్షుడు నడిమెట్ట రాన్న, టిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య, ఉపాధ్యక్షుడు అంకతి రమేష్, నాయకులు పాదం శ్రీనివాస్, లింగన్న, గడును రమేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్, గోళ్ల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.