(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 22: కరీంనగర్ కమిషనరేట్ వ్యాప్తంగా అక్రమ కార్యకలాపాలపై పక్కాసమాచారంతో పోలీసులు కొనసాగిస్తున్న దాడులు సత్పలితాలనిస్తున్నాయి. ఇదే క్రమంలో మంగళవారం కూడా దాడులను కొనసాగించారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పొగాకు ఉత్పత్తులపై దాడులు
కేశవపట్నం పోలీసులు మంగళవారం నాడు లింగాపూర్ గ్రామంలో పక్కాసమాచారం మేరకు దాడులు నిర్వహించి 16,500 రూపాయల విలువ చేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుడు వేముల ప్రకాష్‌పై కేసు నమోదు చేశారు. కరీంనగర్ టూటౌన్ పోలీసులు పద్మానగర్‌లోని ఒకకిరాణం దుకాణంపై దాడి నిర్వహించి మూడు వేల రూపాయల విలువచేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని విక్రయదారుడు మాల్వే గోపాల్‌పై కేసు నమోదు చేశారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కేశవపట్నం పోలీసులు మెట్‌పల్లి గ్రామంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న మూడు ట్రాక్టర్లను పట్టుకున్నారు.
పేకాటరాయుళ్ళ అరెస్ట్
గంగాధర పోలీసులు నాగిరెడ్డిపూర్ గ్రామశివారులో పేకాట ఆడుతున్న ఇద్దరిని పట్టుకున్నారు. ఈ సందర్భంగా 1880రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. పేకాట ఆడుతున్న పంజాల సురేష్, సుంకె మహేందర్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మరో నలుగురు పరారీలో ఉన్నారు.