(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, సెప్టెంబర్ 23: దేశవ్యాప్తంగా సఫాయి కర్మచారీలు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు మర్చిపోలేనివని భారతీయ జనతా పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 70వ జన్మదిన సేవ సప్త ఇక్ సందర్భంగా గోదావరిఖని జవహర్ నగర్ శిశు మందిర్ ఆవరణలో బుధవారం రామగుండం కార్పోరేషన్ కు చెందిన సఫాయి కర్మచారీలను సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సోమారపు నత్యనారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సఫాయి కర్మచారి కరోనా కష్ట సమయంలో ప్రాణాలకు తెగించి చేసిన సేవలు మర్చిపోలేనివని, వీరిని ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా గౌరవించి పాదాభివందనాలు చేయడం జరిగిందని అన్నారు. కరోనా నియంత్రణలో అగ్రభాగాన నిలిచింది సఫాయి కర్మచారేలని పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 50 డివిజన్లలో సఫాయి కార్మికులు చేసిన సేవలు ఈ ప్రాంత ప్రజలు ఏనాడు మర్చిపోలేరని కొనియాడారు అనంతరం సఫాయి కర్మచారులందరిని శాలువాతో సన్మానం చేసి పండ్లు అందించారు
తెలంగాణ దళిత మోర్చా రాష్ట్ర నాయకులు క్యాతo వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎస్ కుమార్, కార్పొరేషన్ ఏరియా బిజెపి అధ్యక్షులు బల్మూరి అమరేందర్ రావు, బిజెపి నాయకులు మాతంగి రేణుక, మారం వెంకటేష్, మామిడి రాజేష్, గుండెబోయిన లక్ష్మణ్, తాడిబోయిన సత్యం, పురుషోత్తం, తాటిపర్తి శ్రీధరరావు, డేవిడ్ రాజు, పెండ్యాల రవికుమార్, మిట్టపల్లి సతీష్ కుమార్, బూడిద రమేష్, నరసయ్య, గొర్రె రాజు అడ్లూరి రాజేష్ మహేష్ మామిడి సంపత్ మిడిదొడ్డి రమేష్, రఘు, భాష బోయిన వాసు, శేఖర్, రవి, తదితరులు పాల్గొన్నారు