– న్యూ ఇండియా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు మాదరబోయిన నర్సయ్య
(ప్రజాలక్ష్యం విలేకరి)
హైదరాబాద్, సెప్టెంబర్ 25: రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ న్యాయమైనదేనని, వారిని వెంటనే ఎస్సీ జాబితాల చేర్చాలని న్యూ ఇండియా పార్టి జాతీయ ఉపాధ్యక్షలు మాదరబోయిన నర్సయ్య అన్నారు. ఈ మేరకు హైదరాబాద్ బొడుప్పల్ న్యూ ఇండియా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి వినతి మేరకు ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాదరబోయిన నర్సయ్య మాట్లాడుతూ రజక కులస్తుల ప్రధాన డిమాండ్ అయినటువంటి ఎస్సీ జాబితాలోకి చేర్చాలనే అంశం న్యాయసమ్మత మైనదిగా జాతీయ న్యూ ఇండియా పార్టీ అబిప్రాయ పడుతుందని తెలిపారు.
దేశంలోని 17 రాష్ట్రాలలో రజకులను ఎస్సీలుగా పరిగణించినపుడు తెలంగాణ రాష్ర్టంలో ఎస్సీ జాబితాలోకి చేర్చడానికి ప్రభుత్వం ఎందుకు మీనవేసాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదని ఆయన విమర్శించారు. రజకులు ఆర్థికంగా చాలా దుర్భర జీవీతాలను అనుభవిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రజకులు సమాజంలో అనేక అవమానాలకు, అస్పృశ్యతకు, స్త్రీలపై అత్యాచారాలు, సాంఘీక బహిష్కరణలకు గురైతున్నట్లు ఆవేదన వ్యక్తం చేసారు.
ఎంతో కాలంగా రజకులను ఎస్సీలో చేర్చాలనే డిమాండు ఉన్నప్పటికి ప్రభుత్వాలు పట్టికోవడం విడ్డూరంగా వుందన్నారు. ఇకనైనా ప్రభుత్వాలు వెంటనే స్పందించి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేసారు.