నటి సాయిపల్లవి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించారు. దీనిలో భాగంగా సాయిపల్లవి మొక్కలు నాటారు. నగరాల్లో వాయు కాలుష్యం పెరుగుతుందని, దానికి మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైన ఉందని, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలని ఆమె తెలిపారు. దానికి ఇదే మంచి తరుణమని, ఈ సందర్భంగా మొక్కను నాటిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
తనకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరిన వరుణ్‌తేజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను కూడా సమంతా, రాణా దగ్గుబాటికి మొక్కలు నాటాలని నామినేట్ చేసినట్లు ట్విట్‌లో పేర్కొన్నారు.
పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో సినీ, రాజకీయ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ని స్వీకరించి మొక్కలు నాటుతున్నారు. అనంతరం వారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు కొనసాగింపుగా మరికొందరికి సవాళ్లను విసురుతున్న విషయం తెలిసిందే.
సినీ నటుడు అక్కినేని అఖిల్ విసిరిన ఛాలెంజ్ ను వరుణ్ తేజ్ స్వీకరించి తన ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం సాయిపల్లవి, తమన్నాను ఈ ఛాలెంజ్ కోసం నామినేట్ చేశారు వరుణ్.
సాయి పల్లవి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించనున్నట్లు రానా తెలిపారు. ఈమేరకు సాయిపల్లవి ట్వీట్ కు ఆయన సరే బాస్ అని రిప్లై ఇచ్చారు. రానాకు జోడీగా సాయి పల్లవి నటిస్తున్న చిత్రం విరాటపర్వం 1992 . వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు.