– పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి
(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
కరీంనగర్, సెప్టెంబర్ 19: నేరరహిత కమిషనరేట్ లక్ష్యసాధనలో భాగంగా ప్రత్యేకదాడులను కొనసాగిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్ రెడ్డి పేర్కొన్నారు. అక్రమ కార్యకలాపాల నియంత్రణకు ప్రత్యేక సమాచార వ్యవస్థను ఏర్పరుచుకోవాలని పోలీసు లకు సూచించారు. గడువుముగిసిన తినుబండారాలు, కల్తీ పదార్ధాలు, విడిభాగాలు విక్రయించే వారిపై కూడా చర్యులు తీసుకోవాలని తెలిపారు. అక్రమకార్యకలాపాల నియంత్రణ కోసం కొనసాగిస్తున్న దాడుల్లో అన్నిస్థాయిలకు చెందిన అధికాయి చురుకైనపాత్ర పోషించాని చెప్పారు. ఈ స్పెషల్‌డ్రైవ్‌లో మొదటిమూడుస్థానాల్లో నిలిచే పోలీసులకు నగదు రివార్డును అందజేస్తామని పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్‌రెడ్డి ప్రకటించారు.
పోలీస్ కమిషనర్ వి.బి. కమలాసన్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు అక్రమకార్యకలాపాల నియంత్రణ కోసం కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు దాడులు ఉదృతం చేశారు. ఈ మేరకు స్పెషల్‌డ్రైవ్‌లను నిర్వహించి గుట్కా, గంజాయి, ఇసుక అక్రమ రవాణా, పేకాటతో పాటు ఇతర రకాల అక్రమకార్యక్రమాల నియంత్రణకు పోలీసులు శనివారం నాడు దాడులను ప్రారంభించారు.
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కేశవపట్నం మండంలోని ఆముదాపల్లిలో ఇసుక అక్రమ రవాణాకు ప్పాడుతున్న మూడు ట్రాక్టర్లలను పోలీసులు పట్టుకున్నారు. చిగురుమామిడి మండలం బాడపల్లి గ్రామశివారులో నిల్వ ఉంచిన 10 ట్రాక్టర్ల ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. గంగాధర మండం వెంకటాయపల్లిలో మూడు ఇసుక ట్రాక్టర్లలను పట్టుకున్నారు.
నిషేదిత పొగాకు ఉత్పత్తల స్వాధీనం
చొప్పదండిలో నిషేదిత పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న దుకాణంపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా 7,500 రూపాయ విలువచేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుడు మహ్మద్ మతావ్వర్‌పై కేసునమోదు చేశారు. చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌లో ఒకదుకాణంపై దాడినిర్వహించి రెండువేల రూపాయల విలువచేసే పొగాకు ఉత్పత్తును స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుడు ఆసరి సంపత్‌పై కేసునమోదు చేశారు.
కరీంనగర్ త్రీటౌన్ పోలీసు నగరంలోని వావిలాపల్లి ప్రాంతంలోని ఒకకిరాణం దుకాణంలో పొగాకు ఉత్పత్తు విక్రయ జరుగుతన్న సమాచారం అందుకుని దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా అక్కడ స్వాధీనం చేసుకున్న నిషేదిత పొగాకు ఉత్పత్తులతోపాటు వారికి సరఫరా కాబడుతున్న వివరాలు సేకరించి కోహెడ మండలం వరికోల్ గ్రామానికి వెళ్ళి దాడి నిర్వహించారు. ఈ ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో 10 వేలరూపాయల విలువచేసే నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. గంగాధర క్రాస్‌రోడ్డు వద్ద కిరాణం దుకాణంపై దాడి జరిపి వివిధ రకాలకు చెందిన 3910 రూపాయల విలువచేసే నిషేదిత పొగాకు ఉత్పత్తును స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారుడు గడ్డం మల్లేశంపై కేసునమోదు చేశారు.
కరీంనగర్ టూటౌన్ పోలీసు జ్యోతినగర్‌ప్రాంతంలోని ఒకదుకాణంపై దాడినిర్వహించి 2100 రూపాయల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకుని విక్రయదారుడు సాయిళ్ళ రాజమ్లయ్యపై కేసునమోదు చేశారు. ఎల్‌యండి పోలీస్‌స్టేషన్ పరిధిలోని అల్గునూరు గ్రామంలో ఆంజనేయ కిరాణం దుకాణంపై దాడి నిర్వహించి 2660 రూపాయల నిషేదిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. సదరు విక్రయదారుడు వీరగోని దయానంద్‌పై కేసునమోదు చేశారు.
పేకాటరాయుళ్ళ పట్టివేత
కరీంనగర్ త్రీటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హౌజింగ్‌బోర్డుకానీలో ఒక ఇంట్లో పేకాట ఆడుతున్న నుగురుని పోలీసు పట్టుకున్నారు. వీరివద్దనుండి 6400 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.