Home తెలంగాణ చిన్న పత్రికలను ఆదుకోవాలి – కేటీఆర్ తోనే సమస్యల సాధన

చిన్న పత్రికలను ఆదుకోవాలి – కేటీఆర్ తోనే సమస్యల సాధన

613
0
save small newspapers
save small newspapers

సమస్యల వలయంలో చిక్కుకున్న చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు యూసుఫ్ బాబు కోరారు. శనివారం ఐ అండ్ పిఆర్ కార్యాలయ ప్రాంగణంలో జరిగిన సంఘం ముఖ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏడాది కాలంగా ప్రకటనలు లేక చిన్న పత్రికల మనుగడ కష్టతరంగా ఉందన్నారు.

మదర్ ఎడిషన్లలో చిన్న పత్రికలకు 15 అక్రిడిటేషన్ కార్డులను మంజూరు చేయాలని ఆయన కోరారు. చిన్న పత్రికల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐటి శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకునేందుకు కృషి చేద్దామన్నారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం కేసీఆర్ సుముఖత వ్యక్తం చేయడం అభినందనీయమన్నారు. చిన్న పత్రికల ఎడిటర్లకు కూడా సముచిత స్థానం కల్పించాలని ఆయన కోరారు. త్వరలోనే హౌజింగ్ సొసైటీని రిజిస్ట్రేషన్ చేయిన్చుకుని మరింత ముందుకు వెళదామన్నారు.

Also Read : గూబ గుయ్యి మనిపించిన సెల్ఫీ పిచ్చి

డిస్ప్లే యాడ్స్ ను వెంటనే పునరుద్ధరించాలని, గతంలో మాదిరిగా ల్యాండ్ అక్విజేషన్ యాడ్స్ ను ఇవ్వాలని కోరారు. ఇంకనూ ఇన్సపేక్షన్ జరుగని పత్రికలు ఈనెల 6 లోగా పూర్తి చేయించుకోవాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నేతలు యాతాకుల అశోక్, పి. దయానంద్, వి.రమేష్ బాబు, ఆగస్టీన్, సుభాష్ రెడ్డి, వెంకటయ్య, భాస్కర్ రెడ్డి, పడకంటి రమేష్, గౌస్, శ్రీనివాస్, జి.రమేష్, సాయికిరణ్
తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here