Home తెలంగాణ నూతన టెక్నాలజీపై వీడియో కాన్ఫరెన్స్‌ …

నూతన టెక్నాలజీపై వీడియో కాన్ఫరెన్స్‌ …

634
0
Participating video conference
Director Planning N. Balaram participating in the video conference

(ప్రజాలక్ష్యం ప్రతినిధి)
గోదావరిఖని, అక్టోబర్‌ 9: 56వ స్టాండింగ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ కమిటీ (ఎస్‌ఎస్‌ఆర్‌సీ) ఆధ్వర్యంలో మినిస్ట్రీ ఆఫ్‌ కోల్‌ సెక్రటరీ అనిల్‌ కుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శుక్రవారం ఆర్‌జీ-1 జీఎం సమావేశ మందిరంలో ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో సింగరేణి నుంచి డైరెక్టర్‌ ప్లానింగ్‌ అండ్‌ (పాజెక్ట్‌, ఫైనాన్స్‌) ఎన్‌.బలరామ్‌ పాల్గొన్నారు. ఈ వీడియో సమావేశంలో మినిస్ట్రీ ఆఫ్‌ కోల్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా నుండి స్టాండింగ్‌ సైంటిఫిక్‌ రీసెర్చ్‌ కమిటీ ఆధ్వర్యంలో రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌ మెంట్‌కు సంబంధించిన నూతన ఆవిష్కరణ బొగ్గు రంగానికి ఏ విధంగా అన్వయింప బడతాయో, స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానం, బొగ్గు రంగానికి అవసరమైన నూతన టెక్నాలజీ పై వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించారు.

ఈ వీడియో కాన్ఫెరెన్స్‌లో ఎస్‌ఓటూ డైరెక్టర్‌ (ప్రాజెక్టు, ఫైనాన్స్‌) ఎ.రమేశ్‌రావు, అర్జీ-1 ఏరియా జనరల్‌ మేనేజర్‌ కల్వల నారాయణ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here