Take a fresh look at your lifestyle.

వామపక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం…

0 1,357

వామపక్ష విద్యార్థి సంఘాల అధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

నిజామాబాద్ ,  ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : SFI, AISF, PDSU, AISB, AIFDS సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎన్టీఆర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామాల అజాద్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టపెట్టేందుకు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి కుట్రలు పన్నుతుందన్నారు. చంద్రయాన్ ద్వారా జాబిల్లి వరకు చేరుకున్న చదువులలో విద్యా కాశీకరణలో తీసుకొచ్చేందుకు చరిత్రను వక్రీకరిస్తున్నారన్నారు. ఎన్సీఈఆర్టీ సిలబస్ను మారుస్తూ, విద్యారంగంలో మూఢత్వాన్ని జోపిస్తుందన్నారు. కేంద్ర బడ్జెట్ లో విద్యారంగానికి 10%నిధులు కేటాయించాలి యూనివర్సిటీ గ్రండ్స్ కమిషన్ కు నిధులను తగ్గించి నిర్వీర్యం చేసే కుట్రను మానుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసి,మైనారిటీ పరిశోధక విద్యార్ధుల ఫెలోషిప్ లలో కోతను విరమించుకోవాలన్నారు. ఈ సమస్యలన్నిటిని పరిష్కరించక పోతే భవిష్యత్తులో పెద్ద యెత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న శాస్త్రీయ విద్య వ్యతిరేకత విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో SFI జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి రాచకొండ. విఘ్నేష్, బోడ.అనిల్, AISF జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురాం, PDSU జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరేందర్, డాక్టర్ కర్క. గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.కే. అషుర్, AISB జిల్లా కార్యదర్శి నాగరాజు, AIFDS జాతీయ కన్వీనర్ రాజశేఖర్,PDSU జిల్లా నాయకులు తిరుమలేశ్, AISF నగర కార్యదర్శి నవీన్ , SFI నగర కార్యదర్శి మహేష్
నాయకులు D.దీపిక,నవీన్, ప్రశాంత్ , భూషణ్,సాయి, శివాజి, రమేష్, సుధాకర్, గణేష్, సందీప్,చత్రుసింఘ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.