Take a fresh look at your lifestyle.

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం…

0 1,556

కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానం

కామారెడ్డి జిల్లా ప్రతినిధి,  మార్చ్ 11 ( లోకంతీరు ) : కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ నిట్టు జాహ్నవి పై అవిశ్వాస తీర్మానం కోరుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు వినతి పత్రాన్ని అందజేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన చైర్పర్సన్ జాహ్నవి పై కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తమ సంతకాలతో కూడిన నోటీసును కలెక్టర్ కు అందించారు.అవిశ్వాస ప్రక్రియకు అనుమతించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందూ ప్రియ, కౌన్సిలర్లు పాత శివ కృష్ణమూర్తి, అన్వర్ అహ్మద్, చాట్ల వంశీకృష్ణ, రాజేశ్వర్, కన్నయ్య, షేరు, శంకర్ రావు, మామిండ్ల రమేష్, తేజప్ ప్రసాద్, వనిత, జహీరా బేగం, పైమా సుల్తాన్, యమీన్, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.