జీవితంపై విరక్తితో వృద్ధుడి ఆత్మహత్య

నాగిరెడ్డిపేట్, ఆగస్టు 31 ( లోకంతీరు ) : మానసికంగా బాధ అనుభవించి జీవితంపై విరక్తితో వృద్ధుడు మృతి చెందిన ఘటన పోచారం గ్రామంలో చోటుచేసుకుందని ఎస్సై మల్లారెడ్డి తెలిపారు.. ఎస్సై వివరాల ప్రకారం … పోచారం గ్రామానికి చెందిన కురుమ హనుమయ్య 77 సంవత్సరాల వృద్ధుడి కొడుకు సాయిలు గత కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో మానసికంగా బాధ అనుభవిస్తూ జీవితంపై విరక్తి చెంది గురువారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటి వద్ద ఏదో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడని , అపస్మారక స్థితిలో ఇంట్లో పడి ఉండడంతో మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా హనుమయ్య శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు మృతుడి మనుమడు సాయిబాబా ఫిర్యాదులో తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.