ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
ఎల్లారెడ్డి, ఆగస్టు 29 ( లోకంతీరు ) : జాతీయ క్రీడ దినోత్సవాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ ఘనంగా జరుపుకున్నారు. భారతదేశానికి హాకీ ఆటలో ప్రాఖ్యాతిగాంచిన మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడల పట్ల కూడా ఆసక్తిని చూపించినప్పుడే శారీరక మానసిక వికాసం సాధ్యమవుతుందని తెలిపారు. 1928,1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో భారత హాకీ జట్టు ధ్యాన్ చంద్ అసమాన క్రీడ సామర్థ్యం వలన బంగారు పథకాన్ని గెలిచిందని పేర్కొన్నారు. భారత హాకీ కి ఎనలేని సేవలు అందించిన గొప్ప వ్యక్తి మేజర్ ధ్యాన్ చంద్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల సూపరింటెండెంట్ వసంతలక్ష్మి , అధ్యాపకులు అమరేశం ప్రభాకర్ రావు, జె.శివకుమార్, నాగానిక, సిద్ధురాజ్, గంగారెడ్డి, గోదావరి, వినయ్ కుమార్, శశిధర్, సంతోష్, చంద్రకాంత్, రాణి, రాజు, సురేష్ రెడ్డి, మోయిన్, స్వప్న తదితరులు పాల్గొన్నారు.