జీవదాన్ పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి
— ఎమ్మార్పీఎస్ నాయకుడు బాగయ్య

కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 25 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ నేషనల్ అధ్యక్షులు బి ఎన్ రమేష్ కుమార్ మాదిగ ఆదేశాల మేరకు విలేకరుల సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కామారెడ్డి జిల్లాలోని ప్రైవేట్ పాఠశాల జీవదాన్ స్కూల్లో ఆరెండ్ల పసిపాపపై అదే స్కూల్లో నిధులు నిర్వహిస్తున్నటువంటి పిటి నాగరాజు అనే యువకుడు ఆరేండ్ల పాప పై అత్యాచారానికి పాల్పడిన వాడు అని వెంటనే శిక్షించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తుంది. ఆ జీవధాన్ స్కూల్ ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ మీద చర్యలు తీసుకోవాలని మా యొక్క డిమాండ్ ఆ పాపకు న్యాయం జరిగేదాకా ఈ ఉద్యమము ఆపబోమని హెచ్చరిస్తున్నాం. ప్రైవేట్ స్కూల్లో చదవాలని తల్లిదండ్రులు కాయకష్టం చేసుకుంటూ ఆ ఫీజులు కట్టలేక కడుపు చంపుకొని పిల్లలను సదుపిస్తామని అనుకుంటే ఈ స్కూళ్లలో జరిగే ఇటువంటి అగాదాలకు పాల్పడిన వాళ్లను మీద చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మాదిగ రాజకీయ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆరు భాగయ్య మాదిగ డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు ప్రెస్ మీటింగ్ లో పాల్గొన్నారు. కోటి అశోక్ అన్న పల్లి సాయిలు, ఆర్ రవి, కొత్తూరు గంగయ్య, ఎం కె బాలరాజు, తదితరులు పాల్గొన్నారు.