హైదరాబాద్ తరలిన బిసి నాయకులు
* మంత్రి పొన్నం, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ ఎంపి వీహెచ్ లకు ఘన సన్మానం
* ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ కు మంత్రి పదవి ఇవ్వాలని తీర్మానం
* బీసీల చైతన్య సదస్సుకు రావాలని ఆహ్వానం

నిజామాబాద్, జనవరి 27 ( లోకం తీరు న్యూస్ ) : ఉమ్మడి నిజామాబాద్ బీసీ సంఘాల ఐక్య వేదిక అధ్వర్యంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపి వి.హన్మంతు రావులను ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ లోని ఫతే మైదాన్ క్లబ్ లో సన్మాన కార్యక్రమం జరిగింది. అనంతరం నిజామాబాద్ జిల్లా కేంద్రంగా నిర్వహించే బీసీల చైతన్య సదస్సుకు హజరు కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, మాజీ ఎంపి వి. హన్మంతు రావులను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, హన్మంతు రావులు మాట్లాడుతూ… బీసీల హక్కుల, డిమాండ్ల సాధనలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. బీసీలంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అప్పుడే రాజ్యాధికారం వస్తుందని హితోపదేశం చేశారు. రాజకీయ ప్రయాణంలో ఎన్నో అవరోధాలు ఎదురైనా, మొక్కవోని దీక్షతో ముందుకెళ్లాలని, అప్పుడే సముచిత స్థానం దక్కుతుందని మార్గనిర్దేశం చేశారు. బీసీల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తమను ఎప్పుడైన కాలవొచ్చని పేర్కొన్నారు. అనంతరం నిజామాబాద్ బీసీ సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ…. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక్క బీసీకి అసెంబ్లీ టికెట్ కేటాయించనందునా, మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పదవి ఇచ్చి, బీసీలకు న్యాయం చేయాలని ముక్త కంఠంతో తీర్మానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి, బీసీ ప్రాబల్యం కలిగిన తమ జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని కోరుతామని తెలిపారు. త్వరలో నిజామాబాద్ లో నిర్వహించబోయే సమావేశంతో, బీసీల సత్తా చాటుతామని శపథం చేశారు.
బీసీ కులస్తులందరు హాజరై, సభ విజయవంతం చేయాలని, త్వరలోనే సభ తేదీ, స్థలం తెలుపుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బీసీ సంఘాల ఐక్య వేదిక నాయకులు ఆకుల రాఘవేందర్, బొబ్బిలి నర్సయ్య, కెంపుల నాగరాజు, ఎనుగందుల మురళి, రేవంత్, క కరిపే గణేష్, శివకుమార్, రతన్, పాల్గొన్నారు.