Take a fresh look at your lifestyle.

చిన్నారిని ఢీ కొట్టిన విజ్ఞాన్ స్కూల్ బస్సు…….

0 1,400

చిన్నారిని ఢీ కొట్టిన విజ్ఞాన్ స్కూల్ బస్సు

నిజామాబాద్, ఆగస్టు 31 ( లోకంతీరు ) :  5 సంవత్సరాల చిన్నారిని ప్రైవేట్ స్కూల్ బస్ ఢీ కొట్టిన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ మేరీ పాఠశాలలో పిపి -2 చదువుతున్న అపర్ణ అనే చిన్నారిని ప్రతిరోజు లాగే చిన్నారి తండ్రి పాఠశాలకు శనివారం ద్విచక్ర వాహనంపై దిగబెట్టడానికి వెళుతున్నాడు. ఈ క్రమంలో సుభాష్ నగర్ చౌరస్తాలో విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ కు చెందిన బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు తో డ్రైవర్ అక్కడి నుండి పరారయ్యాడు. ప్రమాదానికి కారణమైన ప్రైవేట్ స్కూల్ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యు లు డిమాండ్ చేశారు.ఈ ప్రమాదంలో చిన్నారి చేయి విరిగిపోయింది. ప్రస్తుతం చిన్నారి ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటనపై పాఠశాల యాజమాన్యం ఏ విధంగా స్పందించి చిన్నారి కుటుంబానికి న్యాయం చేస్తుందో వేచి చూడాల్సిందే మరి

Leave A Reply

Your email address will not be published.