Take a fresh look at your lifestyle.

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి ….

0 1,388

ఎల్లారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గా మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డి 

–  ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు కృతజ్ఞతలు

 

ఎల్లారెడ్డి, ఆగస్టు 31 (లోకంతీరు) : ఎల్లారెడ్డి మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ కొత్త ఛైర్ పర్సన్ గా మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డిని నియమిస్తూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వు జరిచేయడం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ తోపాటు పాలకవర్గం త్వరలోనే బాధ్యతలు చేపట్టానున్నారు.తమకు కృషి చేసిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ కు కృతజ్ఞతలు తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మార్కెట్ కమిటీ పదవి అప్పగించినందుకు గర్వంగా ఉందని తెలిపారు.కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు కచ్చితంగా ఫలితం ఉంటుందని గుర్తు చేశారు.ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని ఆమె అన్నారు.ఎమ్మెల్యే ఎల్లారెడ్డి ప్రజల శ్రేయస్సు కై పనిచేస్తున్నాడని తెలిపారు. నన్ను నమ్మి ఈ పదవి అప్పగించినందుకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు.

*కొత్త మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ను అభినందించిన కౌన్సిలర్లు*

ఎల్లారెడ్డి వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ కొత్త చైర్ పర్సన్ మారెడ్డి రజిత వెంకట్రాంరెడ్డిని శనివారం పలువురు ఎల్లారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు పద్మ శ్రీకాంత్, నునుగొండ భూదేవి శ్రీనివాస్, అల్లం శ్రీను, నీలకంఠం, బాలమణి పోచయ్య, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.