ముధోల్ మండలానికి రేపు ఎమ్యెల్యే రాక

ముధోల్, నవంబర్ 4 ( లోకంతీరు ) : ముధోల్ మండలంలోని పలు గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి మంగళవారం ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ముదోల్ కు వస్తున్నట్టు బిజెపి ముధోల్ మండల అధ్యక్షుడు కోరి పోతన్న తెలిపారు. ఈ సందర్భంగా కోరి పోతన్న మాట్లాడుతూ మండలంలోని చించాల, వెంకటాపూర్, ముధోల్, విట్టోలి, బొరేగాం, వడ్తాల, చింతకుంట, కారేగాం గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడానికి పర్యటిస్తున్నారన్నారు.