నీటి సమస్య తీర్చిన సుంకేట అన్వేష్ రెడ్డి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి , జులై 21 ( లోకంతీరు ) : వేల్పూర్ మండలం పచ్చల నడకూడ గ్రామంలోని హరిజన మాదిగ వాడలో స్థానికులు నీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. విషయాన్ని తెలుపగా తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి రూ.4లక్షల నిధులను మంజూరు చేయించి నీటి సమస్యను పరిష్కరించారు.ఆదివారం రోజున నీటి నాళ్లను పూజ చేసి ప్రారంభించారు.నీటి సమస్యను పరిష్కరించినందుకు మాదిగ సంఘం సభ్యులు అన్వేష్ రెడ్డి ని సన్మానించారు. మహిళలు కాలనీవాసులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.