వన్నెల్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులో ఇన్సూరెన్స్ అవగాహన సదస్సు

బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 07 ( లోకం తీరు న్యూస్ ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం వన్నెల్ బి గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వారి ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజలందరికీ ఇన్సూరెన్స్ అవశ్యకత గురించి సదస్సును బ్యాంకు మేనేజర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. నిజామాబాద్ రీజినల్ బ్యాంక్ మేనేజర్ అనుప్రియ అధ్యక్షతన గ్రామంలోని వివిధ డ్వాక్రా గ్రూపు సంఘాల సభ్యులు మరియు గ్రామ ప్రజలు ఈ సదస్సులో పాల్గొన్నారు. బ్యాంకు మేనేజర్ గోపాల్ మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ఉపయోగాలు ఆవశ్యకత ఇన్సూరెన్స్(PMJJBY) యొక్క ప్రాధాన్యతను ప్రజలకు వివరించడం జరిగింది. గత కొద్ది రోజులు ముందు ప్రమాదవశత్తు చనిపోయిన వారికి 2 లక్షల రూపాయల చొప్పున చెక్కులను కానూరు దేవన్న, మంతెన అమ్మాయికి చెక్కులను అందజేసి అలాగే ప్రమాదంలో గాయపడ్డ దేవి దాస్ కు వచ్చిన ఇన్సూరెన్స్ వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం పరిచారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.