వైభవంగా ప్రారంభమైన భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీతా భక్తజన ఆశ్రమ వజ్రోత్సవములు.

బాల్కొండ నియోజకవర్గం , ఫిబ్రవరి 16 ( లోకంతీరు ) : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని కిషన్ నగర్ గ్రామంలో భగవాన్ శ్రీ సత్యానంద మహర్షి గీత భక్తజన ఆశ్రమ వజ్రోత్సవములు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉదయం సత్యానంద మహర్షి ఆశ్రమాల పీఠాధిపతులు శ్రీ ఆచార్య శ్రీహరి తీర్థ స్వామి ఓంకార జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం శ్రీ కమలనంద భారతి స్వామి జ్యోతి ప్రజ్వలన చేశారు. వజ్రోత్సవాల ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు, సత్యానంద మహర్షి వారి చిత్రపటాన్ని ఆవిష్కరించారు.
సభ కార్యక్రమంలో దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన మహాత్ములు, పీఠాధిపతులు భక్తుల ఉద్దేశించి ప్రవచనాలు చేశారు.భగవద్గీత పై ప్రచారం హిందూధర్మం ప్రచారం చేశారు.మానవ జీవితంలో ప్రశాంతత అవసరమని , భక్తి మార్గం భగవద్గీతలపై వివరించారు.ఈ కార్యక్రమానికి తెలంగాణలోని ఐదారు జిల్లాలకు చెందిన సుమారు వెయ్యి మంది భక్తులు హాజరయ్యారు. నిర్వాహకులు భక్తులకు అన్నదాన చేశారు