Take a fresh look at your lifestyle.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం….

0 1,376

మండల కేంద్రంలోని

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం….

-వైద్యాధికారి సురేష్

 

కామారెడ్డి జిల్లా /రామారెడ్డి ,మార్చ్ 03 ( లోకంతీరు ) :  రామారెడ్డి మండలంలో వివిధ గ్రామాల్లో,స్థానిక గ్రామ పంచాయితీ ఆవరణలో ఆదివారం ఉదయం పల్స్ పోలియో చుక్కలను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ప్రారంభించారు. 0 వయస్సు నుండి 5 సంవత్సరం లోపు పిల్లలకు పల్స్ పోలియో చుక్కలు వేయించాలని రెండు చిక్కలు నిండు ప్రాణానికి ఆరోగ్యమని ఆరోగ్య సిబ్బంది తెలిపారు. ఈ యొక్క పల్స్ పోలియో కేంద్రాలను పర్యవేక్షించడానికి రాష్ట్ర అధికారి డాక్టర్ రాములు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. మండల వైద్యాధికారి సురేష్ మాట్లాడుతూ మండల కేంద్రంలో 90% పిల్లలకు పోలియో చుక్కలను విజయవంతంగా వేయడం జరిగిందని తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, జడ్పిటిసి నా రెడ్డి మోహన్ రెడ్డి, ఎంపీటీసీ రజిత రాజేందర్ గౌడ్, మాజీ సర్పంచ్ సంజీవ్, సుంకోజి గంగాధర్, సిద్ధి రాములు, ఆరోగ్య సిబ్బంది. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.