Take a fresh look at your lifestyle.

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా…..

0 1,368

మధ్యాహ్న భోజన పథకం కార్మికుల ధర్నా

– ఏఐటియుసి అనుబంధ సంఘం ఆధ్వర్యంలో

కామారెడ్డి జిల్లా ప్రతినిధి , మార్చ్ 11 ( లోకంతీరు ) :ఏఐటీయూసీ అనుబంధ సంఘం.తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నం భోజన పథక సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు . అనంతరం డిఇఓ రాజు కి వినతిపత్రం ఇచ్చిన మధ్యాహ్న భోజన పథకం సంఘం నాయకులు ఏఐటీయూసీ నాయకులు ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన పథకం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చక్రపాణి మాట్లాడుతూ గత నాలుగు నెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని ప్రభుత్వం ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజనం కార్మికులకు న్యాయం చేస్తామని ఇప్పటివరకు నాలుగు నెలలు నుండి అయిదు నెలలు అవుతున్న బిల్లులు ఇవ్వకుండా మధ్యాహ్న పథకాన్ని నడిపించాలని అధికార యంత్రాంగం అనడం వలన అప్పులు తీసుకొచ్చి స్కూల్ పిల్లలకు మధ్యాహ్న భోజన పథకాన్నినిర్వహిస్తున్నామన్నారు.కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము నిరుపేద విద్యార్థులకు అన్నం పెడుతున్న కార్మికులకు బిల్లులు ఇవ్వకుంటే ఈనెల 15వ తేదీ నుండి సమ్మెకు వెళ్లడం జరుగుతుందని కామారెడ్డి డిఇఓ రాజు కి తెలియజేయడం జరిగింది. అనంతరం డీఈఓ రాజు మాట్లాడుతూ సమస్య పరిష్కరిస్తానని అన్నారు. లేకుంటే 15వ తేదీ నుండి మధ్యాహ్న భోజన పథకాన్ని బంద్ నిర్వహిస్తామని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కామారెడ్డి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జ్ వై ఓమయ్య ఏఐటీయూసీ నాయకులు దశరథ్ సాయిలు సోఫియా రియాజుద్దీన్ మల్లవ్వ రాజమణి జిల్లాల నుండి మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న కార్మికులు ధర్నాలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.