వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించొద్దు

కామారెడ్డి జిల్లా , మార్చి14 ( లోకంతీరు ) : సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా కామారెడ్డి జిల్లా కార్యదర్శి పి రామకృష్ణ మార్చి 14 న జాతీయ రైతు సంఘాల ఎస్ కె ఎం పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా కేంద్రంలో సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక చట్టాల వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంధా జిల్లా కార్యదర్శి రామకృష్ణ, మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం మొదటిసారిగా అధికారంలోకి వచ్చే ముందు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని వెనక్కి తీసుకొస్తామని చెప్పి దేశ ప్రజలందరూ జన్ ధన్ ఖాతాలు తీయండి. అందరి ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తానని చెప్పి, యువతకు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి అధికారంలోకి వచ్చాడు. అవి ఏమీ అమలు చేయకుండానే మూడోసారి ప్రధానమంత్రి కావాలని వీళ్ళు ఊరుతున్నాడని ఆయన అన్నారు. అదేవిధంగా దేశ రాజధానిలో కేంద్ర ప్రభుత్వం మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలనీ డిమాండ్ తో 13 నెలల పాటు ఉద్యమిస్తే నరేంద్ర మోడీ రైతు ఉద్యమాలకు దిగివచ్చి రైతుల యొక్క డిమాండ్ల సాధనకు ఒప్పుకొని ఇప్పుడు దొంగ చాటున పాత చట్టాలను కొనసాగిస్తామని ప్రయత్నాలు కనిపిస్తున్నాయని వారన్నారు. ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్, రహదారులు,సముద్ర మార్గాలు, రైల్వేలు, తదితర ప్రభుత్వ సంస్థలు అమ్మివేశారన్నారు.ఈ దేశ సంపద ఆదానికి, అంబానీ చెందినటువంటి కార్పొరేట్ సంస్థలకు అప్ప చెప్పడం సిగ్గుచేటన్నారు.
ఇప్పుడు మిగిలింది వ్యవసాయ రంగం ఒకటే వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోకపోతే వ్యవసాయ రంగం ఈ దేశంలో తీవ్ర సంక్షోభంలో పడే అవకాశం ఉందన్నారు.దాదాపు 250 వందలకు పైగా రైతు సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ ఉద్యమాలు చేపట్టడం జరుగుతుందన్నారు.సంయుక్త కిసాన్ సంఘం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈనెల 14న కిసాన్ పంచాయితీలు నిర్వహించడం, నిరసన ప్రదర్శనలు బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంలో రైతులు కార్మికులు కర్షకులు మేధావులు అందరూ పాల్గొని కిసాన్ మహా పంచాయతీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జి. పరమేష్ , ఐఎఫ్ టియు జిల్లా అధ్యక్షులు పి బాలరాజ్, కార్యదర్శి ఏ ప్రకాష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిహెచ్ అంబన్న, జిల్లా నాయకులు కిషోర్, పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షులు జి సురేష్, ఉపాధ్యక్షులు ముఖేష్, క్రాంతి, లక్ష్మీనారాయణ, రాజు, గోపాల్, సత్యం రెడ్డి సింగ్, బి రాజు, జి దేవేందర్, వెంకట్, పెంటన్న, సామేలు, తదితరులు పాల్గొన్నారు.