జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా విద్యాశాఖ అధికారి

కామారెడ్డి జిల్లా ప్రతినిధి, జూలై 20 ( లోకంతీరు ) : కామారెడ్డి జిల్లాలోని రాజంపేట మండలం తలమడ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థుల తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశం నుర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా విద్యా శాఖ అధికారి రాజు హాజరయ్యారు. విద్యార్థులు ఇంటింటా చదివే మూల, చదువుల యాప్ ను ఉపయోగించాలని తెలియజేసారు. తల్లిదండ్రుల సూచనలు ఉపాధ్యాయులు పాటించాలన్నారు. తల్లిదండ్రులు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. అనంతరం విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ రామస్వామి, ప్రధానోపాధ్యాయులు భిక్షపతి, ఉపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.