కేజీబీవీల్లో కనీస వేతనాలు అమలు చేయాలి.
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి.
-ఎం.సుధాకర్, IFTU జిల్లా ప్రధానకార్యదర్శి

నిజామాబాద్ , జులై 24 ( లోకంతీరు ) : కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్ నాన్ టీచింగ్, వర్కర్ల వేతనాల పెంపు, ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం ప్రగతిశీల కేజీబీవీ నాన్ టీచింగ్, వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టీ.యు) ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా ఐ.ఎఫ్.టీ.యు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ కేజీబీవీ, మోడల్ స్కూల్ నాన్ టీచింగ్, వర్కర్లకు వెంటనే కనీస వేతనాలు అమలు చేయాలన్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, ముఖ్యంగా కాలేజీలుగా అప్ గ్రేడ్ ఐన కేజీబీవీల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలన్నారు. రిటర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. ఉద్యోగ, ఆరోగ్య భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. వంట పాత్రలు ఇతర సామాగ్రిని సరిపడా కొత్తవి అందించాలన్నారు. డ్యూటీచార్ట్ అమలు చేసి, పనిభారం తగ్గించాలన్నారు. కంప్యూటర్ ఒకేషనల్ ఇన్స్ స్టక్టర్లకు ఫుల్ టైం వేతనాలు ఇవ్వాలన్నారు. ఏఎన్ఎం లకు నైట్ డ్యూటీలు తగ్గించాలన్నారు. నాన్ టీచింగ్ సిబ్బందికి బదిలీలు చేపట్టాలన్నారు. గత, ప్రస్తుత ముఖ్యమంత్రులు ఇచ్చిన హామీ మేరకు నాన్ టీచింగ్, వర్కర్లను రెగ్యులరైజ్ చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే ఛలో హైదరాబాద్ నిర్వహిస్తామన్నారు.
జిల్లా కలెక్టర్ స్పందిస్తూ జిల్లా స్థాయిలో పరిష్కరించే సమస్యలను పరిష్కరిస్తామని, వేతనాల సమస్య ఎస్పీడీ తో మాట్లాడతామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కేజీబీవీ మోడల్ స్కూల్ నాన్ టీచింగ్ సిబ్బంది ఈశ్వరి, హేమలత, సుమలత, స్వరూప, మోతి, ఉమ, సుచేంద్ర, స్వర్ణలత, విజయలక్ష్మి, అనురాధ, జ్యోతి, మహేశ్వరి, గీత, సంధ్యా, పద్మ, సువర్ణ, రజియా, సాయమ్మ, గోదావరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.