ఫ్యూచర్ లైన్ కిడ్స్ పాఠశాలలో ఘనంగా బోనాల పండుగ
నిజామాబాదు, జులై 27 ( లోకంతీరు ) : నిజామాబాద్ నగరంలోని ఫ్యూచర్ లైన్ కిడ్స్ పాఠశాలలో బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు, ప్రియాంక, స్వప్న మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ మహిళ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే పండుగ కావున విద్యార్థిని విద్యార్థులకు తెలంగాణ సంస్కృతిక ఆచార వ్యవహారాలను ప్రతిబింబించేలా ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు రాష్ట్రంలో బోనాల పండుగ ఆషాడ మాసంలో నిర్వహించడం ప్రత్యేక సంప్రదాయం. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు లత, సుమలత, గౌతమి, జమున, సంధ్యారాణి,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు