గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రుణ మాఫీ మోసం
– సదాశివనగర్ మాజీ జడ్పీటిసి రాజేశ్వర్ రావు, రామారెడ్డిమాజీ ఎంపిపి దశరథ్ రెడ్డి

కామారెడ్డి జిల్లా, జూలై 27 ( లోకంతీరు ) : జిల్లాలోని సదాశివ నగర్ మాజీ జడ్పిటిసి, రామరెడ్డి మాజీ ఎంపిపి దశరథ్ రెడ్డి శనివారం పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటిసి రాజేశ్వర్ రావు, మాజీ ఎంపిపి దశరథ్ రెడ్డి, రైతుబంధు మండల మాజీ అధ్యక్షులు నారాయణరెడ్డి, గాంధారి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శివాజీ రావు, మాజీ జెడ్పిటిసి ఆప్షన్ మొహినోద్దీన్ మాట్లాడుతూ
గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇప్పటి వరకు 4.5 నుండి 5 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలని పత్రిక సమావేశంలో తెలిపారు. రైతుల రుణ మాఫీపై గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రుణం తీసుకున్న బ్యాంకులో ఉన్న రైతుల రుణాలే కాకుండా ఇతర బ్యాంకులో ఉన్న రుణాలు కూడా ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలన్నారు.అప్పు తీసుకున్న ప్రతి రైతు రుణాలు ఫ్యాక్టరీ యాజమాన్యమే చెల్లించాలని,రెండు, మూడు రోజుల్లో రైతులందరికీ రుణాలు కట్టకపోతే అందరి రైతులతో ఆందోళన ఉదృతం చేస్తామన్నారు.
రైతుల పేరున తీసుకున్న మొత్తం 19 కోట్ల రూపాయలు ఫ్యాక్టరీ యాజమాన్యం బ్యాంకులో జమ చేయాలన్నారు.2003 నుండి ఇలాగే రైతుల పేరున రుణం తీసుకున్నామని ఫ్యాక్టరీ యాజమాన్యం చెబుతుంది. అప్పటి నుండి నాలుగు సార్లు రుణమాఫీ జరిగింది. అంటే రైతు రుణాలు పేరిట గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 100 కోట్ల వరకు దోపిడీ చేసిందన్నారు.గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతు రుణాల పేరిట భారీ మోసం చేసిందని వారు పేర్కొన్నారు.
నిజామాబాద్ లో తీసుకున్న రుణాలు మాత్రమే కాకుండా అన్ని బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలని, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం రైతుల పేరున తీసుకున్న రుణం మాఫీ అయి, రైతులు స్వంతంగా సొసైటీల ద్వారా తీసుకున్న రుణం మాఫీ కాకపోతే వారి భారీగా మోసపోతారు.
రైతులందరి రుణాలను గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాలి లేకపోతే ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.ఈ సంఘటనపై స్థానిక ఎమ్మెల్యే ఇప్పటి వరకు స్పందించలేదు.
ఫ్యాక్టరీ యాజమాన్యంతో అధికారులు సైతం కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, రామారెడ్డి సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు రామ్ రెడ్డి, మద్దికుంట మాజీ ఎంపిటిసి రాజేందర్, ఉప సర్పంచ్ సాయి గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా బిఆర్ఎస్ నాయకులు లింబద్రి నాయక్, జంగం లింగం, కామారెడ్డి మండల నాయకులు రవీందర్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ మోషం పూర్ గ్రామ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.