ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

రాజంపేట , ఏప్రిల్ 19 ( లోకంతీరు ) : రాజంపేట మండలంలోని ఆరెపల్లి ప్రాథమిక పాఠశాల, ఆరెపల్లి తాండ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కోసం మంజూరైన మౌలిక వసతుల కల్పనపై జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, డి.ఈ, ఏ.ఈ లకు పాఠశాల ప్రధానోపాధ్యాయులకు దిశా నిర్దేశం చేశారు. పాఠశాలలకు మంజూరైన పనులను జూన్ 10వ తేదీ లోపు పూర్తి చేయాలని సూచించారు. ఇట్టి పనులను గ్రామ సమాఖ్యల ఆధ్వర్యంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఇట్టి కార్యక్రమంలో డిఇఇ (ఇరిగేషన్) సుష్మా రెడ్డి, ఏఈ ఆనందం, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు లత పాల్గొన్నారు.