బేషరుతగా అందరికి రుణమాఫీ చెయ్యాలి

బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి, జులై 30 ( లోకంతీరు ) : భారతీయ జనతా పార్టీ మండల కిసాన్ మోర‌్చ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చినా హామీ మేరకు ఏకా కాలంలో ప్రతీ రైతుకు 2 లక్షల ఋణ మాఫీ,ప్రతి రైతుకూ ఇస్తామన్న రైతు కూలీలకు 12000 రూపాయలు మరియు కౌలు రైతులకు ఇస్తామన్న 15000 రూపాయలు బేషరతుగా అమలు చేయాలని,ప్రతి ఒక్క రైతుకు రుణ మాఫీ అందరికీ జరిగేలా చూడాలని వేల్పూర్ మండల తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఇవ్వని యెడల ఈ కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఈ కార్యక్రమంలో బాల్కొండ అసెంబ్లి కన్వీనర్ మల్కన్నగారి మోహన్, కిసాన్ మోర‌్చ మండల అధ్యక్షుడు పెద్దోళ్ల నగేష్, వేల్పూరు మండల ప్రధాన కార్యదర్శి దురాజీ రవి పటేల్, కిసాన్ మొర్చ జిల్లా కార్యవర్గ సభ్యుడు నిమ్మల పెద్దన్న, బద్దం సుభాష్, ప్రశాంత్, విఘ్నేష్,శ్రీను యాదవ్, రమేష్ రెడ్డి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.